Farmers | అకాల వర్షాలు కురిసి వారం రోజులు.. రైతులకు అందని సహాయం : హరికృష్ణ రెడ్డి
Farmers | అకాల వర్షాలు కురిసి వారం రోజులు గడిచినా ఇప్పటికీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం చాలా బాధాకరమని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు.
Farmers | తొగుట, మార్చి 05 : సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గుడిగందుల గ్రామంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి మండిపడ్డారు. గుడిగందుల గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాలు కురిసి వారం రోజులు గడిచినా ఇప్పటికీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం చాలా బాధాకరమని అన్నారు.
పంటలు పూర్తిగా నష్టపోయిన రైతులను వెంటనే గుర్తించి, వారికి రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను అధికారులు వెంటనే అంచనా వేసి రైతులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
పంట నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. అదే విధంగా సిద్దిపేట జిల్లాను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. రైతులకు అవసరమైన యూరియాను ఎలాంటి ఆంక్షలు లేకుండా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పర్శయ్య, భూపాల్ రెడ్డి, చంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

