Iran Minister Abbas Araghchi: భారత అతిథిపై దాడి చేశారు: ఇరాన్ మంత్రి అబ్బాస్
Iran Minister Abbas Araghchi: ఇరాన్‌కు చెందిన దేనా ఫ్రిగేట్‌ను అమెరికా పేల్చివేసింది. ఈ ఘటన పట్ల ఇరాన్ రియాక్ట్ అయ్యింది. భారతీయ అతిథిపై ఎటువంటి వార్నింగ్ లేకుండానే దాడి చేశారని ఇరాన్ మంత్రి అబ్బాస్ అన్నారు. దీనికి అమెరికా ప్రతిఫలం చెల్లించుకుంటుందన్నారు.
న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రంలో జరిగిన నౌక విన్యాసాలు పాల్గొని వెళ్తున్న ఇరాన్ నౌకను అమెరికా పేల్చివేసిన ఘటన తెలిసిందే. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఆ నౌక్లో ఉన్న 87 మంది నావికులు మృతిచెందగా, మరికొంత మంది గాయపడ్డారు. దాంట్లో 36 మంది నావికులు ప్రస్తుతం శ్రీలంకలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచీ(Iran Minister Abbas Araghchi) స్పందించారు. ఇరాన్ తీరానికి సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో అమెరికా దారుణానికి పాల్పడిందని, తమ దేశానికి చెందిన ఫ్రిగేట్ దేనా నౌకను అన్యాయంగా పేల్చివేసినట్లు ఆయన తెలిపారు. మంత్రి అబ్బాస్ తన ఎక్స్ అకౌంట్లో ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. 130 సెయిలర్లతో ఉన్న భారతీయ నౌకాదళ అతిథిని అంతర్జాతీయ జలాల్లో ఎటువంటి హెచ్చరిక ఇవ్వకుండానే పేల్చివేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అరగాచీ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అవలంబించిన విధానం ఆ దేశానికి చేదు కానున్నట్లు ఆయన తన హెచ్చరికలో పేర్కొన్నారు.
The U.S. has perpetrated an atrocity at sea, 2,000 miles away from Iran’s shores.
Frigate Dena, a guest of India’s Navy carrying almost 130 sailors, was struck in international waters without warning.
Mark my words: The U.S. will come to bitterly regret precedent it has set. pic.twitter.com/cxYiI9BLUk
— Seyed Abbas Araghchi (@araghchi) March 5, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

