Harish rao | ప్రాజెక్టులపై రేవంత్ మౌనం ఎందుకు? : హరీశ్‌రావు
ప్రాజెక్టులపై తెలంగాణ వ్యతిరేక ప్రతిపాదనలను ఉపసంహరించుకోకుండా సమావేశం నిర్వహిస్తే ఈ నెల 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.
- ప్రతిపాదనలు ఉపసంహరించుకోకుండా సమావేశం నిర్వహిస్తే 18న జీఆర్ఎంబీ ఆఫీస్‌ను ముట్టడిస్తాం
- బీఆర్ఎస్ ప్రశ్నించగానే బోర్డుకు ప్రభుత్వం లేఖలు
- రాజకీయాలు వద్దు.. రాష్ట్ర భవిత ముఖ్యం: హరీశ్
హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : ప్రాజెక్టులపై తెలంగాణ వ్యతిరేక ప్రతిపాదనలను ఉపసంహరించుకోకుండా సమావేశం నిర్వహిస్తే ఈ నెల 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఏడు కీలక నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకునేలా జీఆర్ఎంబీ ఎజెండాలో అంశాలను చేర్చినా, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటంపై హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం హడావుడిగా లేఖలు రాస్తున్నదని పేర్కొన్నారు. అసలు ఎజెండా రూపొందించే సమయంలో జీఆర్ఎంబీని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కేవలం ఉత్తరాలు రాయడం వల్ల పనులు కావని, తెలంగాణ నీటి హకుల సాధన కోసం ప్రభుత్వం రాజీలేని పోరాటం చేయాలని హరీశ్‌రావు హితవు పలికారు. జీఆర్ఎంబీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి తెలంగాణకు చేస్తున్న జలద్రోహాన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో అడ్డుకుంటుందని తేల్చిచెప్పారు.
ప్రభుత్వానికి హరీశ్‌రావు ప్రధాన డిమాండ్లు
- ఎజెండాను తొలగించాలి: ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాలో పొందుపరిచిన తెలంగాణ వ్యతిరేక అంశాలను తక్షణమే ఉపసంహరించుకునేలా ఒత్తిడి తీసుకురావాలి. సమావేశాన్ని బహిషరించాలి. వివాదాస్పద అంశాలను ఎజెండా నుంచి తొలగించే వరకు ఈ నెల 18న జరుగబోయే జీఆర్ఎంబీ సమావేశానికి హాజరుకాబోమని తెలంగాణ ప్రభుత్వం కరాఖండిగా తేల్చిచెప్పాలి.
- రాజకీయ లబ్ధి కోసం రాజీపడొద్దు: వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం సమావేశానికి హాజరై ఏపీ అభ్యంతరాలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తే బీఆర్ఎస్ ఊరుకోదు. ఇది కేవలం రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. తెలంగాణ భవిష్యత్తు, మన నీటి హకులకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం. ప్రతిపక్షాలపై అనవసర ప్రేలాపనలు చేసే సీఎం రేవంత్‌రెడ్డి, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ యత్నిస్తుంటే అడ్డుకోవడం మీ కనీస బాధ్యత.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

