Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి ముందు ఓటీటీ సర్ప్రైజ్.. 4 ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్
Ranabaali | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. ‘ట్యాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా విజయదశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ranabaali | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. ‘ట్యాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా విజయదశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ‘రణబాలి’ గురించి ఓ ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి వస్తుంది. కానీ ‘రణబాలి’ విషయంలో మాత్రం మేకర్స్ ఓ విభిన్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సినిమా కథకు సంబంధించిన నేపథ్యాన్ని ప్రేక్షకులకు ముందుగానే పరిచయం చేసేందుకు అంతర్జాతీయ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో నాలుగు ఎపిసోడ్ల ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
‘రణబాలి: నెవర్ ఫర్గెట్ ది ట్రూత్’ పేరుతో ఈ ప్రత్యేక సిరీస్ రూపొందుతోంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనకు సంబంధించిన చారిత్రక అంశాలతో పాటు.. ‘రణబాలి’ సినిమా నేపథ్యానికి సంబంధించిన వివరాలు, ప్రత్యేకమైన తెరవెనుక విశేషాలు ఇందులో ఉండనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో మొత్తం నాలుగు ఎపిసోడ్లు ఉండనున్నాయి. మొదటి ఎపిసోడ్ ‘ది ఫెమైన్ వి ఫర్గాట్’ పేరుతో సెప్టెంబర్ 28న విడుదల కానుంది. రెండో ఎపిసోడ్ ‘ది హిస్టరీ వి ఫర్గాట్’ పేరుతో సెప్టెంబర్ 30న స్ట్రీమింగ్కు రానుంది. మూడో ఎపిసోడ్ ‘ది మెన్ వి ఫర్గాట్’ పేరుతో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాలుగో ఎపిసోడ్ ‘ది లాస్ట్ లోడ్’ పేరుతో రూపొందుతుండగా.. దాని విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. చరిత్రకు సాధారణంగా రెండు కోణాలు ఉంటాయని.. ఒకటి పుస్తకాల్లో మనకు పరిచయమైన చరిత్ర కాగా, మరొకటి కాలగర్భంలో కలిసిపోయిన లేదా విస్మరించబడిన అంశాలు ఉంటాయనే భావనతో ఈ సిరీస్‌ను రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. సమాజానికి తెలియని చారిత్రక నేపథ్యాలను, అప్పటి పరిస్థితులను ఈ డాక్యుమెంటరీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా థియేటర్లలో ‘రణబాలి’ కథను చూసే ముందు.. ఆ కథకు సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడం ఈ డాక్యుమెంటరీ సిరీస్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. సినిమా విడుదలకు దాదాపు రెండు వారాల ముందే తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుండటంతో.. ఈ సిరీస్ ద్వారా సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా కంటే ముందే దాని నేపథ్యాన్ని వివరించే డాక్యుమెంటరీ సిరీస్‌ను ఓటీటీలోకి తీసుకురావడం ‘రణబాలి’ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. సెప్టెంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభం కానున్న ఈ నాలుగు ఎపిసోడ్ల సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అలాగే ఈ డాక్యుమెంటరీ సినిమా కథను అర్థం చేసుకోవడంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
On
28.09.26
30.09.26
02.10.26
**.**.**We are coming to correct our altered history 🔥#Ranabaali #NeverForget #RanabaaliOnOct16th pic.twitter.com/dQV4RQFMFb
— Mythri Movie Makers (@MythriOfficial) September 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

