నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని మీర్ బాగ్ కాలనీ లోని షా రెసిడెన్సీ అపార్ట్మెంట్లో దారుణ ఘటన జరిగింది. అపార్ట్మెంట్ నాలుగో ఫ్లోర్లోని 402 రూమ్లో ఇద్దరూ వ్యక్తుల మధ్య శనివారం రాత్రి జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన కూలీల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. వీరు నల్లగొండలో త్వరలో ప్రారంభం కానున్న చెన్నై షాపింగ్ మాల్ భవనంలో ఇంటీరియర్ వర్క్ కోసం తమిళనాడు నుంచీ వచ్చినట్లు సమాచారం. వీరు పగలు అక్కడ పని చేస్తూ రాత్రి బస కోసం అపార్ట్మెంట్లో ఉంటున్నట్లు తెలిసింది.
రాత్రి కూడా యధావిధిగా పని నుంచి వచ్చాక కూలీ డబ్బుల విషయంలో మాటామాటా పెరిగి ఘర్షణగా మారినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెల్సిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ శివరామరెడ్డి నేతృత్వంలోని టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.