న్యూఢిల్లీ: పాకిస్థాన్ కోసం గూఢచర్యానికి పాల్పడిన నేవీ ఉద్యోగిని రాజస్థాన్ సీఐడీ నిఘా విభాగం అరెస్ట్ చేసింది. (Navy staffer arrested for spying) పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాక్‌కు రహస్య సమాచారాన్ని అతడు చేరవేసినట్లు నిర్ధారణ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోని నేవీ ప్రధాన కార్యాలయంలో హర్యానాకు చెందిన విశాల్ యాదవ్ క్లర్క్‌గా పని చేస్తున్నాడు. పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ)కు చెందిన మహిళా ఏజెంట్ ప్రియా శర్మతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. దీంతో నేవీ కార్యకలాపాలు, రక్షణ సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆమెకు షేర్ చేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా కీలకమైన రక్షణ సమాచారాన్ని పాకిస్థాన్‌కు లీక్ చేశాడు.
కాగా, పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలను రాజస్థాన్ సీఐడీ నిఘా విభాగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ మహిళా ఐఎస్ఐ ఏజెంట్ ప్రియా శర్మతో విశాల్ యాదవ్‌కు సంబంధాలున్నట్లు గుర్తించారు. దీంతో అతడిపై నిఘా పెట్టారు. నేవీతో పాటు ఇతర రక్షణ సంస్థల రహస్యాలను పాక్ మహిళకు అతడు షేర్ చేస్తున్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు విశాల్ యాదవ్ మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. దీంతో పాక్ మహిళ ప్రియా శర్మతో చాలా ఏళ్లుగా అతడు సంప్రదింపులు జరుపడంతోపాటు ఆమెకు కీలక సమాచారం పంపినట్లు నిర్ధారణ అయ్యిందని పోలీస్ అధికారి తెలిపారు. క్రిప్టో లావాదేవీల ద్వారా అతడికి డబ్బును ఆమె చెల్లించినట్లు తెలిసిందని చెప్పారు. ఆన్లైన్ గేమింగ్‌కు బానిసైన విశాల్ యాదవ్ ఆర్థికంగా నష్టపోవడంతో గూఢచర్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. జైపూర్‌లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్లో దర్యాప్తు సంస్థలు అతడ్ని ప్రశ్నిస్తున్నాయి. గూఢచర్య నెట్‌వర్క్‌లో ఇతర వ్యక్తులు పాల్గొన్నారా అన్నది ఆరా తీస్తున్నారు.
Also Read:
SCO Declaration: ఎస్సీవో డిక్లరేషన్‌పై సంతకం చేయని రాజ్‌నాథ్ సింగ్
Watch: జనంపైకి దూసుకెళ్లిన డ్రగ్స్ స్మగ్లర్ వాహనం.. తర్వాత ఏం జరిగిదంటే?
Watch: వస్త్ర దుకాణం నుంచి బట్టల ప్యాక్‌లు చోరీ చేసిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే?