జైపూర్: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. మినీ లారీని వేగంగా నడిపాడు. బారికేడ్లను తప్పించబోయి అదుపుతప్పిన ఆ వాహనం జనంపైకి దూసుకెళ్లింది. (Truck Rams, Mows Down People) ఈ ప్రమాదంలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 23న ఒక వ్యక్తి వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రోడ్డు మధ్యలో పోలీస్ వాహనాన్ని ఉంచారు. ఒక షాపు ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కాగా, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు డ్రగ్స్ స్మగ్లర్ ప్రయత్నించాడు. వాహనాన్ని వేగంగా నడిపి బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ సందర్భంగా అక్కడున్న జనం మీదకు ఆ వాహనం దూసుకెళ్లింది. గమనించిన ఆ వ్యక్తులు తప్పించుకునేందుకు పరుగులు తీశారు. పోలీస్ కానిస్టేబుల్‌తో సహా ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.
మరోవైపు డ్రగ్స్ స్మగ్లర్ అయిన 28 ఏళ్ల రింకూ వాహనం నుంచి కిందపడ్డాడు. గాయపడిన అతడు కాలినడకన అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వాహనంలో ఉన్న 68 కిలోల మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
राजस्थान के श्रीगंगानगर में डोडा तस्करों ने नाकाबंदी कर रही पुलिस की गाड़ी को इस तरह से टक्कर मारी की खिलोनों की तरह इंसानों की लासे उडती हुई नजर आई…..😡
विडियो 23 जून का बताया जा रहा है, राजस्थान में जंगलराज इस तरह से फैला हुआ है।@8PMnoCM @INCRajasthan @TikaRamJullyINC pic.twitter.com/HFqoyCHgSA— Pappu Ram Mundru Sikar (@PRMundru) June 24, 2025
Also Read:
Tej Pratap | కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ఇంటర్వ్యూలో.. తేజ్ ప్రతాప్ పాస్