న్యూఢిల్లీ: ఒక వ్యక్తి బురఖా ధరించాడు. యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి ఆమెను తోసేశాడు. (Man Pushes Teen From 5th Floor) తీవ్రంగా గాయపడిన ఆ యువతి మరణించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జూన్ 23న ఉదయం 8.30 గంటలకు అశోక్ నగర్లో నివసిస్తున్న 19 ఏళ్ల నేహా బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన 26 ఏళ్ల తౌఫీక్‌ను నిందితుడిగా గుర్తించారు. బురఖా ధరించిన అతడు ఆ రోజు ఉదయం నేహా ఇంట్లోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు. బిల్డింగ్‌పై నుంచి ఆమెను తోసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఒకచోట దాగిన అతడ్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు కొన్ని నెలలుగా తౌఫీక్, నేహా రిలేషన్లో ఉన్నారని పోలీస్ అధికారి తెలిపారు. మరో మహిళతో అతడికి వివాహం గురించి బిల్డింగ్ ఐదో అంతస్తుపై వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు చెప్పారు. తౌఫీక్ ఆగ్రహంతో నేహాను కిందకు తోయడంతో ఆమె మరణించిందని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
కాగా, పోలీసుల వాదనను నేహా తండ్రి ఖండించారు. తన కుమార్తెకు తౌఫీక్తో ప్రేమ సంబంధం లేదన్నారు. తమ కుటుంబానికి మూడేళ్లుగా అతడు తెలుసని చెప్పారు. తరచుగా తమ ఇంటికి వచ్చే తౌఫీక్‌కు నేహా రాఖీ కూడా కట్టిందని తెలిపారు.
Also Read:
Couple Kills Disabled Man | దివ్యాంగుడ్ని చంపిన దంపతులు.. సిమెంట్‌తో నింపిన ట్రంక్‌పెట్టెలో మృతదేహం
Shubhanshu Shukla | రోదసి యాత్రకు ముందు.. తల్లిదండ్రులకు శుభాన్షు ఏం సందేశం పంపారంటే..