రాయ్‌పూర్: ఒక దివ్యాంగుడ్ని భార్యాభర్తలు హత్య చేశారు. (Couple Kills Disabled Man) అతడి మృతదేహాన్ని ట్రంక్‌పెట్టెలో ఉంచి సిమెంట్‌తో నింపారు. ఆ తర్వాత ఒక చోట దానిని పడేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న దంపతులను అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల కిషోర్ పైక్రా దివ్యాంగుడు. శారీరక వైకల్యం ఉన్న అతడి బాగోగులను భార్యాభర్తలైన అంకిత్ ఉపాధ్యాయ్, శివానీ శర్మ చూస్తున్నారు. కిషోర్‌కు చెందిన భూమిని రూ.50 లక్షలకు వారు అమ్మారు. అయితే భూమి రూ.30 లక్షలకే అమ్ముడుపోయినట్లు అతడికి చెప్పారు.
కాగా, తన భూమి రూ.50 లక్షలకు అమ్ముడైనట్లు కిషోర్ తెలుసుకున్నాడు. మిగతా రూ.20 లక్షలు ఇవ్వాలని అంకిత్, శివానీని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ దంపతులు అతడ్ని హత్య చేశారు. కిషోర్ మృతదేహాన్ని ట్రంక్‌పెట్టెలో ఉంచి సిమెంట్‌తో నింపారు. జూన్ 16న ఒక కాలనీలో అద్దె ఇంటిని ఆ భార్యాభర్తలు పరిశీలించారు. మరునాడు మూడో అంతస్తులోని ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు.
మరోవైపు జూన్ 23న దంపతులైన అంకిత్, శివానీ బరువైన ఇనుప ట్రంక్పెట్టెను లిఫ్ట్‌లో కిందకు తరలించారు. సమీపంలోని నిర్జన ప్రదేశానికి వాహనంలో తీసుకెళ్లి పడేశారు. దీనిని గమనించిన స్థానికుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ట్రాంక్పెట్టెను తెరిచిచూశారు. ఒక వ్యక్తి మృతదేహాన్ని అందులో ఉంచి సిమెంట్‌తో నింపినట్లు గమనించి షాకయ్యారు.
కాగా, మిస్సింగ్ కేసు నమోదైన దివ్యాంగుడు కిషోర్ పైక్రాను మృతుడిగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అంకిత్, శివానీని నిందితులుగా నిర్ధారించారు. గోల్బజార్లోని ఒక షాపులో ‘హబ్బూ భాయ్’ అని గుర్తున్న ట్రంక్ పెట్టెను వారు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. అదృశ్యమైన ఆ దంపతులు ఢిల్లీలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టి అక్కడకు వెళ్లారు. జూన్ 24న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అంకిత్, శివానీని అరెస్ట్ చేసి ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. ఆస్తి అమ్మకం వివాదం నేపథ్యంలో జరిగిన ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
रायपुर, छत्तीसगढ़ सूटकेस हत्याकांड: रायपुर के इंद्रप्रस्थ में सूटकेस में मिली लाश की सुलझी गुत्थी, रिटायर्ड ASI के बेटे-बहु का CCTV वीडियो वायरलhttps://t.co/ERMWWYe4Jn#ChhattisgarhNews #Chhattisgarh #ChhattisgarhUpdates #RaipurNews #Raipur #viral #रायपुर #वायरल #CCTV pic.twitter.com/fPxoI6ggkG
— चउचक मीडिया (@chauchakmedia) June 24, 2025
Also Read:
Bikram Majithia | డ్రగ్స్ కేసులో పంజాబ్ మాజీ మంత్రి అరెస్ట్..!
Sanjay Raut | దేశంలో గత పదకొండేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ : సంజయ్ రౌత్