Sanjay Raut : దేశంలో గడిచిన పదకొండేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ (Undeclared emergency) కొనసాగుతున్నదని, నాడు ఇందిరాగాంధీ (Indhira Gandhi) ఎమర్జెన్సీ విధించడంలో తప్పులేదని శివసేన ఎంపీ (Shiv Sena MP) సంజయ్ రౌత్ (Sanjay Raut) వ్యాఖ్యానించారు. అప్పట్లో రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవిస్తూనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ అనేది కూడా ఒక రాజ్యాంగబద్ధమైన చర్యనేనని, కాబట్టి బీజేపీ చెబుతున్నట్టుగా ఎమర్జెన్సీని ‘సంవిధాన్ హత్యా దివస్’ పరిగణించలేమని రౌత్ చెప్పారు. ఇందిరాగాంధీ తలుచుకుంటే మాయ చేసి, డబ్బులు పంచి ఎన్నికల్లో గెలిచేదని, కానీ ఆమె అలా చేయలేదని అన్నారు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యానికి కాపలాదారుగా ఉండేవారని చెప్పారు.