Donald Trump: అణు కేంద్రాలు ధ్వంసం కాలేదన్న అమెరికా ఇంటెలిజెన్స్.. ఆ రిపోర్టును కొట్టిపారేసిన అధ్యక్షుడు ట్రంప్
Donald Trump: బీ2 బాంబర్ల దాడిలో అణు కేంద్రాలు ధ్వంసం కాలేదని అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. అయితే ఆ రిపోర్టును అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు.
న్యూయార్క్ : ఇజ్రాయిల్ , ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధానికి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటన చేయడంతో.. రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. ఇక ఆదివారం ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బీ2 బాంబర్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో అణు కేంద్రాలు ధ్వంసం కాలేదని అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. దీనికి సంబంధించిన రిపోర్టు ఒకటి రిలీజైంది. ఫోర్డో, నటాంజ్, ఇస్పాహన్ కేంద్రాలపై జరిగిన దాడులు విఫలమైనట్లు పెంటగాన్ ఇంటెలిజెన్స్ రిపోర్టులో వెల్లడైంది. ఇరాన్ అణు కేంద్రాల్లో ఉన్న సెంట్రిఫ్యూజ్‌లకు ఎటువంటి నష్టం జరగలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. కేవలం భూమి మీదున్న కట్టడాలు మాత్రమే స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలిపారు. అణు కేంద్రాల వద్ద ఉన్న ఎంట్రెన్స్‌లు, కొన్ని బిల్డింగ్లు ధ్వంసమైనా.. అండర్‌గ్రౌండ్‌లో మాత్రం ఎటువంటి నష్టం జరగలేదన్న రిపోర్టులో వెల్లడించారు.
అణు కేంద్రాలకు నష్టం జరగలేదని వచ్చిన రిపోర్టులను అధ్యక్షుడు ట్రంప్ కొట్టిపారేశారు. ట్రుత్ సోషల్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు. అమెరికా మీడియాతో పాటు మీడియా సంస్థల రిపోర్టింగ్‌పై ఆయన విమర్శలు చేశారు. సీఎన్ఎన్తో పాటు న్యూయార్క్ టైమ్స్ .. అత్యంత విజయవంతంగా సాగిన మిలిటరీ దాడుల్ని తప్పుగా చిత్రీకరిస్తున్నాయని, ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలు పూర్తి ధ్వంసం అయ్యాయని, సీఎన్ఎన్తో పాటు టైమ్స్ వార్తా సంస్థలను ప్రజలు విమర్శిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
— Donald J. Trump (@realDonaldTrump) June 25, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- CNN
- Donald Trump
- iran
- newyork times
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

