Cabinet : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన ఇవాళ కేంద్ర క్యాబినెట్ (Union cabinet) సమావేశమైంది. ఉదయం 11 గంటలకు సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా జాతీయ భద్రత, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇరాన్-ఇజ్రాయెల్ (Iran vs Israel) యుద్ధం వల్ల భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండనుందనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం, విమాన ప్రమాద నివారణ చర్యలపై కూడా చర్చ జరుగనుంది. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా క్యాబినెట్ చర్చించనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు పహల్గాం ఉగ్రదాడిపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ భేటీలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది.