Tawi river | జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rain) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. పలు నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. తాజాగా జమ్ములోని తావి నది (Tawi river)లో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు.
#WATCH | J&K: A man stranded in Tawi river in Jammu. The river is in spate as the water level rose due to overnight rainfall. More details awaited. pic.twitter.com/N2FoQ0kdWv
— ANI (@ANI) June 25, 2025
భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం తావి నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి నది మధ్యలో ప్రమాదవశాత్తూ చిక్కుకుపోయాడు. నదిలోని ఓ వంతెన వద్ద చిక్కుకుపోయాడు. సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. నది ఒడ్డున ఉన్న స్థానికులు ఆ వ్యక్తిని గుర్తించి సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో వీలు పడట్లేదు. దీంతో వారు సహాయ బృందాలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిచ్చెన సాయంతో నీటి మధ్యలో చిక్కుకుపోయిన వ్యక్తిని సురక్షితంగా రక్షించారు. వ్యక్తి నది మధ్యలో చిక్కుకుపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#UPDATE | #WATCH | J&K: The man stranded in Tawi river in Jammu has now been safely rescued by SDRF personnel. pic.twitter.com/wE0iTbFOjh
— ANI (@ANI) June 25, 2025
Also Read..
Shubhanshu Shukla | రోదసి యాత్రకు రెఢీ.. డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి వ్యోమగాములు
F 35B Fighter Jet | పది రోజులుగా భారత్లోనే బ్రిటన్ ఫైటర్ జెట్..!