F 35B Fighter Jet | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets)లో ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala) లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport) లోనే ఉంది. సాంకేతిక సమస్య కారణంగా ల్యాండ్ అయిన ఈ జెట్ గత 10 రోజులుగా భారత్‌లోనే నిలిచిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ బ్రిటిష్ జెట్‌కు సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నారు.
అయితే ఆ జెట్‌లో సమస్య ఏంటి..? ఇన్ని రోజులు ఎందుకు చిక్కుకుపోయిందన్న విషయంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. గత పది రోజులుగా తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ఆరుబయటే ఈ జెట్‌ను పార్క్ చేశారు. దీంతో దాన్ని హ్యాంగర్‌కు తరలించమని భారత్ చేసిన విజ్ఞప్తిని బ్రిటన్ నేవీ (UK Navy) సున్నితంగా తిరస్కరించింది. ఈ ఫైటర్ జెట్ సాంకేతికత గురించి ఆందోళన కారణంగా వారు ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా తెలిసింది. తుది తనిఖీల సమయంలో మాత్రం దీన్ని హ్యాంగర్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంటోంది.
బ్రిటన్ దేశానికి చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ ఇటీవల ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత నేవీతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేసింది. బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఆ నౌకలోని యుద్ధ విమానం ఎఫ్-35 ఇంధనం తగ్గడంతో జూన్ 14న తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని ముందుగా వార్తలు వినిపించాయి. అయితే, ఇన్ని రోజులు అది ఇక్కడే ఉండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిసింది.
ఆ ఫైటర్ జెట్‌లో సమస్యను సరిచేసిన తర్వాత తిరిగి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పైకి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫైటర్జెట్కు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తున్నది. మన దేశంలో ఓ విదేశీ యుద్ధ విమానం ఐదు రోజులపాటు నిలిచిపోవడం, అందులోనూ ఎఫ్-35 లాంటి 5వ తరం స్టెల్త్జెట్ మోరాయించడం సాధారణ విషయం కాదు. కాగా ఈ విమానం షార్ట్ టేకాఫ్‌తోపాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా దీనిలోనే మరో వేరియంట్ విమానాన్ని ఇరాన్‌పై దాడులకు వాడుతున్నది.
Also Read..
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు రంగం సిద్ధం.. మరికొద్దిసేపట్లో ఐఎస్ఎస్కు..
PM Modi: ఎమర్జెన్సీ రోజుల్ని ఏ భారతీయుడూ మరిచిపోలేరు: ప్రధాని మోదీ
Fire Accident: పాలిథీన్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు