న్యూఢిల్లీ: ఢిల్లీలో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. రితాలా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నది. ఆ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా సాగుతున్నట్లు అధికారులు చెప్పారు. సుమారు 15 ఫైరింజన్లు మంటలు అర్పుతున్నాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు చెందిన సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆ కంపెనీలో ప్లాస్టిక్ ప్రింటింగ్‌తో పాటు దుస్తులు తయారీ చేస్తున్నట్లు డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏకే జైస్వాల్ తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు చెబుతున్నారు. బిల్డింగ్‌లోని రెండవ, మూడవ ఫ్లోర్‌లోకి అడుగుపెట్టే అవకాశం లేకుండా ఉన్నది. పై ఫ్లోర్లలో ఎవరైనా చిక్కుకున్నారో తెలిసేందుకు ఇంకా సమయం పడుతుందన్నారు.
#WATCH | Delhi: 3 people died and three were injured after a fire broke out in a polythene factory near the Rithala metro station yesterday at around 7.30 pm, say Delhi police
The search operation is still going on.
(Morning visuals from the spot) pic.twitter.com/RmMXSE0nef
— ANI (@ANI) June 25, 2025