గెలిచినా ఇంటికే..
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కథ ముగిసింది.గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్తును దక్కించుకోవాలంటే ఆతిథ్య శ్రీలంకపై భారీ తేడాతో నెగ్గాల్సిన వేళ.. ఆ జట్టు మ్యాచ్‌ను గెలుచుకున్నా నెట్న్‌ర్రేట్ విషయంలో చతికిలపడి టోర్నీ నుంచి సూపర్-8 దశలోనే నిష్క్రమించింది.
- లంకపై పాక్ విజయం సెమీస్‌కు కివీస్
పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కథ ముగిసింది.గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్తును దక్కించుకోవాలంటే ఆతిథ్య శ్రీలంకపై భారీ తేడాతో నెగ్గాల్సిన వేళ.. ఆ జట్టు మ్యాచ్‌ను గెలుచుకున్నా నెట్న్‌ర్రేట్ విషయంలో చతికిలపడి టోర్నీ నుంచి సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (60 బంతుల్లో 100, 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఈ టోర్నీలో రెండో శతకంతో చెలరేగగా మరో ఓపెనర్ ఫకార్ జమాన్ (42 బంతుల్లో 84, 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మొదటి వికెట్‌కు రికార్డు స్థాయిలో 176 పరుగులు జతచేశారు. కానీ ఫకార్ నిష్క్రమణ తర్వాత ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పెవిలియన్‌కు క్యూ కట్టింది.సెమీస్‌కు అర్హత సాధించాలంటే శ్రీలంకను 147 పరుగులకే నియంత్రించాల్సిన పాకిస్థాన్.. ఆ క్రమంలో విఫలమైంది. అబ్రర్ అహ్మద్ (3/23) మ్యాజిక్ స్పెల్‌తో రాణించినా 94 రన్స్‌కే 4 కీలక వికెట్లు కోల్పోయిన లంకను కెప్టెన్ దసున్ శనక (31 బంతుల్లో 76 నాటౌట్, 2 ఫోర్లు, 8 సిక్స్‌లు), పవన్ రత్నాయకె (58) గెలిపించినంత పనిచేశారు. శనక మెరుపులతో లంకేయులు విజయానికి చేరువగా వచ్చి 20 ఓవర్లకు 207/6 వద్ద ఆగిపోయారు. మ్యాచ్‌లో పాక్ గెలిచినా నెట్న్‌ర్రేట్ (-0.461) మెరుగ్గా ఉండటంతో గ్రూప్-2లో న్యూజిలాండ్ (+1.390) సెమీస్‌కు అర్హత సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

