MP Arvind Kumar : బీజేపీ ఎంపీ అర్వింద్ కుమార్ జర్నలిస్టుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ స్థాయిలో ఉన్న అర్వింద్ జర్నలిస్ట్‌పై అనవసరంగా నోరు పారేసుకోవడడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని టీబ్ల్యూజేఎఫ్ నిరసన వ్యక్తం చేసింది.
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్మీట్లో ఎంపీ అర్వింద్ మాట్లాడారు. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ ఎంపీని ప్రశ్నించారు. అంతే.. ఒక్కసారిగా కోపిష్టిగా మారిన అర్వింద్. ‘ఇప్పటిదాకా చెప్పిన కదా బేవకూఫ్.. వినలే’ అంటూ పరుషంగా మాట్లాడారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి జర్నలిస్ట్‌ను అలా అమర్యాదగా మాట్లాడడం సిగ్గుచేటని టీబ్ల్యూజేఎఫ్ వ్యాఖ్యానించింది.
జర్నలిస్టుపై నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
ఇప్పుడే చెప్పిన కదా “బేవకూఫ్” అంటూ ప్రశ్న అడిగిన విలేఖరిపై అహంకార ధోరణితో మండిపాటు pic.twitter.com/CVYdytqwqx
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2026
‘ప్రెస్మీట్లు పెట్టి మీరు చెప్పిందే రాసుకోవాలా ? ప్రశ్నలు అడగకూడదా ?’ అని టీబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్యలు ఎంపీని ప్రశ్నించారు టీబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు. జర్నలిస్టులపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఎంపీ తక్షణమే ఉపసంహరించుకోవాలనీ, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ వీరు చేశారు. ఎంపీ క్షమాపణ చెప్పని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని టీబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు హెచ్చరించారు.