ICC : వన్డే సిరీస్ ముగియడంతో పొట్టి ఫార్మాట్‌కు సిద్ధమవుతున్న భారత్(Team India), వెస్టిండీస్(West Indies)లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షాకిచ్చింది. నామమాత్రమైన మూడో వన్డేలో ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు ఇరుజట్లకు జరిమానా విధించింది. ముల్లన్పూర్ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనుందకు టీమిండియా, విండీస్ మ్యాచ్ ఫీజులో కోత పెట్టింది.
స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌కు భారీగా జరిమానా పడింది. ఓదార్పు విజయంతో ఊపిరి పీల్చుకున్న వెస్టిండీస్‌కు కూడా ఫైన్ విధించింది ఐసీసీ. అక్టోబర్ 3, శనివారం ముల్లన్పూర్ వన్డేలో ఇరుజట్లు కోడ్ ఉల్లంఘనకు పాల్పడడమే అందుకు కారణం. ఆ మ్యాచ్‌లో తొలుత విండీస్, ఆపై టీమిండియా నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేదు.
India were found four overs short of the target rate in New Chandigarh and fined 20% of their match fees, while West Indies were deemed to be two short and fined 10% https://t.co/E2x7gVQ5Dq
— Cricinfo (@cricinfo) October 5, 2026
స్లో ఓవర్ రేటు (Slow Over Rate)ను గమనించిన రిఫరీ ప్రకాశ్ భట్ ఇరుజట్లు ఐసీసీ ఆర్టికల్ 2.22 నియమాన్ని అతిక్రమించాయని తెలిపారు. మ్యాచ్‌లో విండీస్ 2 ఓవర్లు, భారత్ 4 ఓవర్లు ఆలస్యంగా వేశాయి. ఇదే విషయాన్ని మైదానంలోని అంపైర్ జయరామన్ మదన్‌గోపాల్, సామ్ నొగజ్స్కీ, థర్డ్ అంపైర్ షరీఫుద్దౌలా, నాలుగో అంపైర్ వీరేందర్ శర్మలు రెండు జట్లకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు. వీరి నిర్ణయాన్ని కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, షాయ్ హోప్‌లు అంగీకరించారు.
స్లో ఓవర్ రేటు కారణంగా విండీస్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం.. టీమిండియాకు 20 శాతం జరిమానా పడింది. గత మూడేళ్ల కాలంలో కరీబియన్ జట్టుకు ఇది రెండో ఫైన్. జూలైలో న్యూజిలాండ్‌తో వన్డేలో సైతం.. రెండు ఓవర్ల ఆలస్యంతో మ్యాచ్ ఫీజులో10 శాతం సమర్పించుకుంది. భారత జట్టు విషయానికొస్తే.. నిరుడు డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో రాయ్‌పూర్ వన్డేలో స్లో ఓవర్ రేటు ఫలితంగా పది శాతం మ్యాచ్ ఫీజు కోల్పోయింది. వన్డే సిరీస్‌లో కంగుతిన్న హోప్ బృందం టీ20 సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ సేనతో తలపడనుంది. అక్టోబర్ 6 మంగళవారం నుంచి ఇరుజట్ల మధ్య పొట్టి సిరీస్ మొదలవ్వనుంది.