చెన్నై: విమానం ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేషన్ కోసం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారి లంచం డిమాండ్ చేశారు. ఒక విమానయాన సంస్థ డైరెక్టర్ నుంచి రూ.2.5 లక్షలు తీసుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపపథ్యంలో డీజీసీఏ అధికారితో పాటు విమానయాన సంస్థ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసింది. (CBI arrests DGCA official) తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ఏక్వి ఎయిర్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఒక ట్రైనింగ్ ఫ్లైట్‌కు ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేషన్ సంబంధించి చెన్నై డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ (ఎయిర్‌వర్తినెస్) సుశీల్ కుమార్ గార్గ్ లంచం డిమాండ్ చేశారు. ఇది సీబీఐ దృష్టికి వెళ్లింది.
కాగా, ఆ విమానయాన సంస్థ డైరెక్టర్ సచిన్ కేశవ్ భానే నుంచి డీజీసీఏ అధికారి సుశీల్ కుమార్ గార్గ్ రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని అరెస్ట్ చేశారు. విమానాల ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేషన్‌లో అనుచిత సహాయం అందించినందుకు ప్రతిఫలం ఆశించడం, చట్టవిరుద్ధంగా లంచం డిమాండ్ చేసి స్వీకరించడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.