Police Jobs | పోలీస్ ఉద్యోగార్థులకు తీపికబురు.. వయోపరిమితి మరో రెండేళ్లకు పెంపు..!
Police Jobs : ఇటీవలే ఏడు వేల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ ఇచ్చిన సర్కార్.. యూనిఫామ్డ్ సర్వీసెస్ (పోలీస్) ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లకు పెంచింది.
Police Jobs : పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇటీవలే ఏడు వేల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ ఇచ్చిన సర్కార్.. యూనిఫామ్డ్ సర్వీసెస్ (పోలీస్) ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లకు పెంచింది. ఇప్పటివరకున్న ఐదేళ్లకు.. ఈ రెండేళ్లు కలవడంతో మొత్తంగా గరిష్ట వయోపరిమితి పెంపు ఏడేళ్లకు చేరింది. ఈ సడలింపు ప్రస్తుతం రిక్రూట్మెంట్లకు వర్తింస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
యూనిఫామ్డ్ సర్వీసెస్ (పోలీస్) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 2026 మే 18వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ యూనిఫామ్డ్ సర్వీసెస్ పోస్టులకు నిర్దేశిత గరిష్ట వయోపరిమితికి అదనంగా ఐదేళ్ల వయో సడలింపు కల్పించారు. తాజాగా ఉత్వర్వులు, G.O.Ms.No.122 ద్వారా ఆ ఐదేళ్ల సడలింపునకు అదనంగా మరో రెండేళ్లను పెంచారు. దీంతో నిర్దేశిత గరిష్ట వయోపరిమితిపై మొత్తం ఏడు సంవత్సరాల వరకు అదనపు వయో సడలింపు లభించనుంది. ఆగస్టు 14, శుక్రవారం నుంచి ఈ గరిష్ట పెంపు అమలులో ఉండనుంది.
నిరుద్యోగ యువత నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. మరింత మంది నిరుద్యోగ యువత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత పొందేలా ఈ వయోపరిమితి పెంపు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB), తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), సంబంధిత శాఖలు మరియు అధికారులకు ఈ ఉత్తర్వులను అమలు కోసం పంపించారు.ఈ వయోపరిమితి పెంపు పోలీస్, ఫైర్, జైళ్లు, SPF, ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖల్లోని యూనిఫామ్డ్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు వర్తిస్తుంది.
Telangana Government Raises Upper Age Limit for Uniformed Services (Police) Recruitment by Another 2 Years
యూనిఫామ్డ్ సర్వీసెస్ (పోలీస్) ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు
యూనిఫామ్డ్ సర్వీసెస్ (పోలీస్) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిరుద్యోగ యువతకు… pic.twitter.com/Zsv2Ptmgoa
— Congress for Telangana (@Congress4TS) August 14, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

