న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1975 నుంచి 1977 వరకు ఆ నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. తన ఎక్స్ అకౌంట్లో ఆయన రియాక్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో ఎలా రాజ్యాంగ స్పూర్తిని ఉల్లంఘించారో ఏ ఒక్క భారతీయుడు కూడా మరిచిపోలేరని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ సూత్రాలను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భారత స్వాతంత్ర్య చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకట అధ్యాయం అని ఆయన వెల్లడించారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను ఆ సమయంలో పట్టించుకోలేదని విమర్శించారు. ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేశారన్నారు. పత్రికా స్వేచ్ఛ నాశనమైందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో భారీ సంఖ్యలో రాజకీయ నేతల్ని, సామాజిక కార్యకర్తలను, విద్యార్థులను, సాధారణ పౌరుల్ని కూడా జైలులో వేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఆ నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అరెస్టు చేసిందన్నారు. ఎమర్జెన్సీ రోజుల్ని సంవిదాన్ హత్య దివస్‌గా జరుపుకోనున్నట్లు చెప్పారు.
We salute every person who stood firm in the fight against the Emergency! These were the people from all over India, from all walks of life, from diverse ideologies who worked closely with each other with one aim: to protect India’s democratic fabric and to preserve the ideals…
— Narendra Modi (@narendramodi) June 25, 2025