Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు స్వదేశానికి చేరుకున్నారు. ఇరాన్ (Iran) నుంచి భారతీయులతో బయల్దేరిన ప్రత్యేక విమానం బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఈ విమానంలో 282 మంది భారతీయులు క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చారు. ‘జూన్25న తెల్లవారుజామున మాషా (ఇరాన్) నుంచి 282 మంది భారతీయులతో ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. దీంతో ఇప్పటి వరకూ ఇరాన్ నుంచి 2,858 మందిని స్వదేశానికి తీసుకొచ్చాం’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఇరాన్ నుంచి ఇది 11వ విమానం అని పేర్కొంది. ఇందులో పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంకకు చెందిన వారు కూడా ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ నుంచి మూడు విమానాల్లో దాదాపు 594 మంది భారత పౌరులు, నేపాల్, శ్రీలంక పౌరులను సురక్షితంగా తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్, ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన దాదాపు 3180 మంది భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినట్లు వివరించింది.
282 Indian nationals were evacuated from Iran on a special flight that arrived in New Delhi from Mashhad at 00:01 hrs on 25th June.
With this, 2858 Indian nationals have been brought home from Iran. pic.twitter.com/Mgl84eBxQW
— Randhir Jaiswal (@MEAIndia) June 24, 2025
Also Read..
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు రంగం సిద్ధం.. మరికొద్దిసేపట్లో ఐఎస్ఎస్కు..
Earthquake | అండమాన్ సముద్రంలో భూకంపం
F 35B Fighter Jet | పది రోజులుగా భారత్‌లోనే బ్రిటన్ ఫైటర్ జెట్..!