Shah Rukh Khan | ముంబైలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘ఏబీపీ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2026’ (ABP Ideas of India Summit) వేదికపై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనదైన ప్రసంగంతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఇక్కడికి ఎవరికో అవార్డులు ఇవ్వడానికి రాలేదని, ఈ వేదికపై ఉన్న స్ఫూర్తిదాయక వ్యక్తుల నుంచి ధైర్యం మరియు ఉత్సాహం అనే ఇంజెక్షన్‌ను తీసుకుని వెళ్లడానికి వచ్చానని పేర్కొన్నారు. జీవితంలో ముందుకు సాగడానికి ధైర్యం, ఉత్సాహం అనేవి అత్యంత అవసరమైన విటమిన్లని, ముఖ్యంగా పారా ఒలింపిక్ విజేతలు అవని లేఖరా, ప్రవీణ్ కుమార్ వంటి వారి పోరాట పటిమ తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. నేటి తరం యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, వారు చూపిస్తున్న పట్టుదల తనలో కొత్త శక్తిని నింపుతున్నాయని, అందుకే తాను ఇక్కడికి నేర్చుకోవడానికి, స్ఫూర్తిని పొందడానికి వచ్చానని షారుఖ్ ఖాన్ ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు. కింగ్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Shah Rukh Khan at ABP Ideas of India Summit 2026:
“main yaha par kisi ko award dene nahi aaya hoon, main yaha par courage aur enthusiasm ka injection lekar jaana chah raha hoon”
Virat was so right, SRK really is the definition of humility ❤️ pic.twitter.com/GM7QvCP7Lo
— Raj (@idfcwau) February 27, 2026