Rakul Preet Singh | కారు కొనాలనే ఆశతో హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇది విని ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
Rakul Preet Singh | టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ధృవ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, లౌక్యం, ఖాకీ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి తనకు హీరోయిన్ కావాలనే కల ఏ మాత్రం లేదని రకుల్ తెలిపారు.
Rakul Preet Singh | టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ధృవ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, లౌక్యం, ఖాకీ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి తనకు హీరోయిన్ కావాలనే కల ఏ మాత్రం లేదని రకుల్ తెలిపారు. కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో అనుకోకుండా తనకు సినిమా అవకాశం వచ్చిందని చెప్పారు.ఎక్కడో నా ఫొటోలు చూసిన కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన వారు మా నాన్నను సంప్రదించారు. సినిమాలో నటించే అవకాశం ఉందని చెప్పారు. అప్పటివరకు సినిమాల గురించి నాకు పెద్దగా అవగాహన లేదు.
కానీ వారు రూ.5 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పగానే వెంటనే ఆసక్తి కలిగింది అని రకుల్ గుర్తు చేసుకున్నారు. తొలి సినిమా చేయడానికి కారణం నటనపై ఆసక్తి కాదని, కారు కొనాలనే కోరికేనని రకుల్ చెప్పడం విశేషం.ఆ రూ.5 లక్షలతో కారు కొనాలని అనుకున్నాను. మా ఫ్రెండ్స్‌లో అప్పటివరకు ఎవరి దగ్గరా కారు లేదు. నేను మొదటివారిగా కారు కొనాలి అనిపించింది. అదే ఆ సినిమా చేయడానికి ప్రధాన కారణం అని ఆమె నవ్వుతూ తెలిపారు. తొలి సినిమా కోసం దాదాపు 40 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్న తర్వాతే నటనపై తనకు నిజమైన ఆసక్తి పెరిగిందని రకుల్ చెప్పారు.కెమెరా ముందు పనిచేయడం నాకు చాలా నచ్చింది. అప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సినిమాలనే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను.
అందుకే మొదటి, రెండో సినిమాల మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అలాగే కాలేజీ అటెండెన్స్, చదువుకు ఇబ్బంది కలగకూడదని కెరీర్ ప్రారంభంలో కొన్ని పెద్ద సినిమా అవకాశాలను కూడా వదులుకున్నాను. ఇండస్ట్రీలోకి నేను నా సొంత ప్రతిభతోనే వచ్చాను. ఎవరి సహాయం తీసుకోలేదు అని వివరించారు. రకుల్ ప్రీత్ సింగ్ 2009లో కన్నడ చిత్రం గిల్లీ తో హీరోయిన్గా పరిచయమయ్యారు. తెలుగులో మాత్రం 2013లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘స్పైడర్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘ఖాకీ’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. బాలీవుడ్లో కూడా ‘యారియాన్’, ‘దే దే ప్యార్ దే’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు.
వ్యక్తిగత జీవితంలో 2024లో నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న రకుల్.. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ‘రామాయణ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె శూర్పణఖ పాత్రలో కనిపించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

