Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. డాక్టర్ జగదీశ్ సజీవ దహనం
సూర్యాపేట జిల్లా ఖమ్మం- హైదరాబాద్ 365 బిబి జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ఖమ్మం- హైదరాబాద్ 365 బిబి జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఓ ప్రముఖ వైద్యుడు కారులోనే సజీవ దహనమయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు పిల్లలమర్రి శివారు ప్రాంతానికి చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఖమ్మం నగరంలో మమత హాస్పిటల్లో న్యూరో సర్జన్‌గా సేవలు అందిస్తున్న న్యూరో సర్జన్ జగదీశ్ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

