డా. జగదీష్ మృతి పట్ల సంతాపం తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
రోడ్డు ప్రమాదంలో మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డా. జగదీష్ మృతిపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదంలో మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డా. జగదీష్ మృతిపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. డా. జగదీష్ మృతి వైద్య రంగానికి, ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు. కాగా, సూర్యాపేట జిల్లా ఖమ్మం- హైదరాబాద్ 365 బిబి జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఓ ప్రముఖ వైద్యుడు కారులోనే సజీవ దహనమయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు పిల్లలమర్రి శివారు ప్రాంతానికి చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ను వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఖమ్మం నగరంలో మమత హాస్పిటల్లో న్యూరో సర్జన్గా సేవలు అందిస్తున్న న్యూరో సర్జన్ జగదీశ్ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

