Jurala | జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం మొదలైంది. నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు కృష్ణ జలాలు వదలడంతో వరద నీరు ఆదివారం జూరాల ప్రాజెక్టులో కలిశాయి. ప్రస్తుతం జూరాలకు 3,227 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే జూరాల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316.09 మీటర్లుగా ఉన్నది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 5.318 టిఎంసీలు ఉన్నది.