Earthquake | అండమాన్ సముద్రం (Andaman Sea)లో భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలు (Richter scale)పై భూకంపం తీవ్రత 4.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. తెల్లవారుజామున 1:43 గంటల ప్రాంతంలో ప్రకంపనలు నమోదైనట్లు తెలిపింది. భూమికి 20 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ ప్రకంపనలతో సముద్రంలో అల్లకల్లోలం నెలకొంది. కెరటాలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తీర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
Also Read..
F 35B Fighter Jet | పది రోజులుగా భారత్లోనే బ్రిటన్ ఫైటర్ జెట్..!
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు రంగం సిద్ధం.. మరికొద్దిసేపట్లో ఐఎస్ఎస్కు..
PM Modi: ఎమర్జెన్సీ రోజుల్ని ఏ భారతీయుడూ మరిచిపోలేరు: ప్రధాని మోదీ