Leopard: పొలంలోకి వచ్చిన చిరుత.. దానితో సెల్ఫీ దిగిన రైతు.. వీడియో వైరల్
Leopard : పొలంలోకి వచ్చిన చిరుతను చూసి రైతు భయపడలేదు. ధైర్యంగా దాని దగ్గరకు వెళ్లాడు. మొబైల్ ఫోన్‌తో సెల్ఫీ దిగాడు. ఆ చిరుత కూడా జంకలేదు. చాలా కూల్‌గా కూర్చుని సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతున్నది.
పాట్నా: ఓ చిరుత(Leopard) ఓ రైతు పొలంలోకి ప్రవేశించింది. అయితే ఆ రైతు దాన్ని చూసి భయపడలేదు. పరుగెత్తలేదు. చాలా కూల్‌గా దాని దగ్గరకు వెళ్లాడు. ఆ చిరుతతో సెల్ఫీ దిగాడు. ఆ చిరుత తొలుత టెన్షన్ పడ్డా.. ఆ తర్వాత ఆ రైతుకు అది సహకరించింది. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పొలంలోకి వచ్చిన చిరుతు చూసి రైతు ఏమాత్రం కంగారుపడలేదు. తన వద్ద మొబైల్ ఫోన్ తీసి నింపాదిగా సెల్ఫీ దిగాడు. ఆ వ్యక్తికి కొంత దూరంలో చిరుత మౌనంగా కూర్చుండిపోయింది.
కొంత దూరం నుంచి కొందరు వ్యక్తులు ఈ చిత్రాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. చిరుత కూడా దూకుడు ప్రదర్శించలేదు. చిరుత, రైతు మధ్య ఘర్షణ జరిగినట్లు వీడియోలో లేదు. బీహార్ రాష్ట్రంలో ఎక్కడో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. చిరుత, మనిషి సెల్ఫీ దిగిన తీరు ఆన్లైన్ వ్యూవర్లను ఆకట్టుకుంటున్నది. సోషల్ మీడియా యూజర్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించిన నిజనిర్ధారణ జరగలేదు. కేవలం వీడియో మాత్రమే వైరల్ అవుతోంది.
Farmer in India took a selfie with a leopard that entered his field.. pic.twitter.com/GGV7BWUk5L
— Damn Nature You Scary (@AmazingSights) February 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- farmer
- leopard
- Paddy field
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

