నిర్మాణంలో ఉన్న గోడకూలి..
ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధి వెంకట్‌రెడ్డినగర్ డివిజన్ రామంతాపూర్ రామ్రెడ్డినగర్ కాలనీ-4లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి. సోమవారం రామ్రెడ్డినగర్ కాలనీ -4లోని ఇంటి యజమాని రాములు తనకు ఉన్న 80 గజాల స్థలంలో జీ+2, ఆపైన పెంట్‌హౌజ్ నిర్మాణం చేపట్టాడు. దీంతో నిర్మాణ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో పకన ఉన్న సిమెంట్ రేకుల ఇంటిపైన ప్రమాదవశాతు ఇటుకల గోడ కూలింది.
- చిన్నారికి తీవ్ర గాయాలు
- ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు
- అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదమంటూ స్థానికుల ఆగ్రహం
రామంతాపూర్, మార్చి 10: ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధి వెంకట్‌రెడ్డినగర్ డివిజన్ రామంతాపూర్ రామ్రెడ్డినగర్ కాలనీ-4లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి. సోమవారం రామ్రెడ్డినగర్ కాలనీ -4లోని ఇంటి యజమాని రాములు తనకు ఉన్న 80 గజాల స్థలంలో జీ+2, ఆపైన పెంట్‌హౌజ్ నిర్మాణం చేపట్టాడు. దీంతో నిర్మాణ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో పకన ఉన్న సిమెంట్ రేకుల ఇంటిపైన ప్రమాదవశాతు ఇటుకల గోడ కూలింది. ఈ ప్రమాదంలో రేకుల ఇంటి యజమాని రమేశ్, సరస్వతి దంపతుల కుమార్తె విన్య(6) అనే చిన్నారిపై తలపై ఇటుకలు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఓ పైవేటు దవాఖనకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీసీ, ఏసీపీ
రామంతాపూర్ రామ్రెడ్డినగర్ కాలనీ-4లో నిర్మాణదశలోని గోడ కూలి చిన్నారికి తీవ్రగాయాలైన విషయం తెలుసుకున్న ఉప్పల్ మున్సిపల్ డీసీ రాజు, ఉప్పల్ జోనల్ సిటీ ప్లానర్ కృష్ణమోహన్, ఏసీపీ నాగిరెడ్డి, టీపీఓ రాజేందర్ తన సిబ్బందితో కలిసి ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించారు. అసలు ఆ ఇంటి నిర్మాణ అనుమతులు ఏంటి, ఎలా నిర్మిస్తున్నారు, నిర్మాణ దశలో చేపట్టిన జాగ్రత్తలు ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇంటి యజమానిపై అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే ఆ ఇంటి అనుమతులు లేని పై కప్పును తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో రామ్రెడ్డినగర్ టౌన్‌ప్లానింగ్ అధికారులు పైకప్పును తొలగించే పనులు చేపట్టారు. ఈ విషయమై ఉప్పల్ పోలీసులను ఆరా తీయగా.. తల్లి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

