Iran Israel War | గల్ఫ్‌లో చిక్కుకున్న 5 లక్షల మంది భారతీయ విద్యార్థులు
Iran Israel War | విదేశాల్లో చదువుకుంటున్న మొత్తం భారతీయ విద్యార్థుల్లో పావు వంతు మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న దరిమిలా ఈ విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడే అవకాశమే గాకుండా వారంతా భద్రతాపరమైన ముప్పును కూడా ఎదుర్కొంటున్నారు.
Iran Israel War | న్యూఢిల్లీ, మార్చి 2 : విదేశాల్లో చదువుకుంటున్న మొత్తం భారతీయ విద్యార్థుల్లో పావు వంతు మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న దరిమిలా ఈ విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడే అవకాశమే గాకుండా వారంతా భద్రతాపరమైన ముప్పును కూడా ఎదుర్కొంటున్నారు. 2025 నాటి లెక్కల ప్రకారం 150 దేశాల వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, స్కూళ్లలో 18.80 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. పశ్చిమాసియాలో పావు వంతుమంది అంటే దాదాపు 5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్న ఈ ప్రాంతంలో అనేక స్కూళ్లు భారతీయులకు అనుగుణంగా ఉండే సిలబస్‌నే బోధించడంతో భారతీయ విద్యార్థులు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
విద్యా హబ్‌గా గల్ఫ్
ప్రభుత్వ గణాంకాల ప్రకారం అత్యధికంగా 2,53,832 మంది భారతీయ విద్యార్థులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చదువుకుంటుండగా, తర్వాత స్థానాల్లో వరుసగా సౌదీ అరేబియా(75,830), కువైట్(50,000), ఖతార్(49,346), ఒమన్ (44,847) ఉన్నాయి. బహ్రెయిన్ (28,620), ఇజ్రాయెల్(900)ని కూడా కలుపుకొంటే ప్రస్తుత యుద్ధానికి ప్రభావితమైన దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 5 లక్షల వరకు ఉండవచ్చని తెలుస్తున్నది. వీరుగాక ఉద్యోగ నిమిత్తం గల్ఫ్ దేశాలకు వచ్చి స్థిరపడిన భారతీయుల సంఖ్య అదనం. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి 2న పశ్చిమాసియాలో జరుగవలసి ఉన్న 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను సీబీఎస్ఈ వాయిదావేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

