O Andala rakshasi | యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న షెరాజ్ మెహదీ స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన మూవీ ‘ఓ అందాల రాక్షసి. విహాన్షి హెగ్డే, కృతి వర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురేందర్ కౌర్ నిర్మించారు.
అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలు చేసే వారికి ఎలాంటి శిక్షలు వేయాలి.. అమ్మాయిల జోలికొస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే నేపథ్యంలో తెరకెక్కిన ఓ అందాల రాక్షసి తెలుగులో జనవరి 2న విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది.
ఇప్పుడు కన్నడలో ఓ సుందర రాక్షసి టైటిల్‌తో విడుదలై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఈ మూవీలో సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ, నేహా దేశ్ పాండే, అనంత్ బాబు, ప్రియా ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి షెరాజ్ మెహదీ మ్యూజిక్ అందించడం విశేషం.
Read Also :
Lokah Chapter 2 | లోక చాప్టర్ 2పై కళ్యాణి ప్రియదర్శన్ క్రేజీ న్యూస్
Premabhishekam | ‘ప్రేమాభిషేకం’కు 45 ఏళ్లు.. ప్రత్యేక వీడియో షేర్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్