The Kerala Story 2 | 2023లో బాక్సాఫీస్ వద్ద వివాదాలు సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఈ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతోంది. మొదటి భాగం కంటే ఈ సీక్వెల్ మరింత వివాదాస్పదంగా, అత్యంత తీవ్రమైన అంశాలతో రూపొందినట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.
రాబోయే 25 ఏళ్లలో భారత్ ఇస్లామిక్ రాజ్యంగా మారుతుంది అనే వివాదాస్పద డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభంకాగా.. ఈసారి దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ కథను కేవలం కేరళకే పరిమితం చేయకుండా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్నట్లు చెబుతున్న బలవంతపు మత మార్పిడిలు, లవ్ జిహాద్ వంటి అంశాలను ఇందులో చూపించారు. నిర్మాత విపుల్ అమృత్లాల్ షా నిర్మించిన ఈ చిత్రంలో గతంలో నటించిన అదా శర్మ స్థానంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలు పోషించారు. మత మార్పిడికి నిరాకరించిన యువతులను చిత్రహింసలకు గురిచేయడం, బలవంతంగా గొడ్డు మాంసం(Beef) తినిపించడం వంటి కఠినమైన దృశ్యాలను మేకర్స్ ఈ ట్రైలర్లో పొందుపరిచారు.
అయితే ఈ ట్రైలర్‌పై కేరళ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బలవంతంగా గొడ్డు మాంసం తినిపించే సన్నివేశంపై వారు మండిపడుతున్నారు. కేరళలో బీఫ్‌ను అందరూ ఇష్టంగా తింటారని, ఎవరికీ బలవంతంగా తినిపించాల్సిన అవసరం లేదని, హిందుత్వ రాజకీయాలు కేరళలో పని చేయవని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసిన ‘ప్రోపగాండా’ చిత్రమని విమర్శిస్తున్నారు. మరోవైపు, ఈ సినిమా సమాజంలోని చేదు నిజాలను ధైర్యంగా చూపిస్తోందని మరికొందరు సమర్థిస్తున్నారు.
Kerala’s response to the Kerala Story #KeralaStory pic.twitter.com/1pxiLezugl
— Comrade From Kerala 🌹 (@ComradeMallu) February 18, 2026
This is the real Kerala story….. A land where different religions cultures and foods exist…..
Not the lies shown in The Kerala Story movie. That film misrepresents our food, culture, and people, spreading false narratives that don’t reflect reality.#thekeralastory #Kerala pic.twitter.com/YhfNVklREP
— Nakul Chemanchery (@NChemanchery) February 18, 2026