గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు(SLvIND) తొలి ఇన్నింగ్స్‌లో ఇండియాకు 178 పరుగుల ఆధిక్యం లభించింది. ఇవాళ మూడో రోజు శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. సోనల్ దినుషా సెంచరీతో ఆకట్టుకున్నాడు. దినుషా సెంచరీ చేయడంతో శ్రీలంక ఫాలోఆన్ తప్పించుకున్నది. ఇక భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుడు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్‌ను అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు రాణించారు. వాస్తవానికి తొలి సెషన్లో 5 వికెట్లు తీసినా.. రెండో సెషన్లో దినుషా, డిక్వెల్లా కీలక ఇన్నింగ్స్ ఆడారు.
టెస్టుల్లో దినుషా తొలి సెంచరీ నమోదు చేశాడు. 168 బంతుల్లో అతను సెంచరీ పూర్తి చేశాడు. దాంట్లో 4 బౌండరీలు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. డిక్వెల్లా 115 బంతుల్లో 80 రన్స్ చేసి ఔటయ్యాడు. దినుషా, డిక్వెల్లాలు అయిదో వికెట్‌కు 146 రన్స్ జోడించారు. ఈ భాగస్వామ్యంతో శ్రీలంక ఫాలోఆన్ తప్పించుకున్నది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 462 రన్స్ ఆలౌటైంది. శ్రీలంక ఆలౌటైన తర్వాత వర్షం రావడంతో మూడో రోజు ఆట ముగిసింది.
Innings Break!
Sri Lanka are all-out for 2⃣8⃣4⃣
4⃣ wickets for Manav Suthar
3⃣ wickets for Ravindra Jadeja
1⃣ wicket each for Mohammed Siraj, Prasidh Krishna and Kuldeep YadavScorecard ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/kOzprMVVsZ
— BCCI (@BCCI) August 17, 2026