BJP | తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని ఎంత దీమాతో ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర నాయత్వం ఆశలపై ఆ పార్టీ అధిష్ఠానం నీళ్లు చల్లినట్లుయింది. సోమవారం భారతీయ జనతా పార్టీ కొత్త టీమ్‌ను ప్రకటించింది. అనేక మంది ముఖ్య నేతలకు.. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే జాతీయ స్థాయిలోగ తెలంగాణ ప్రాధాన్యత తగ్గిపోయింది. ముగ్గురు కీలక నేతల జాతీయ పదవులకు ఎండ్ కార్డ్ పలికారు.
గతంలో తెలంగాణకు దక్కిన మూడు కీలక జాతీయ పదవులను బీజేపీ హై కమాండ్ తొలగించింది. గతంలో తెలంగాణ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కే. లక్ష్మణ్ వ్యవహరించారు. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ఒక్క పదవి కూడా దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీజేపీకి భష్యత్ లేదనే ఉద్దేశంతోనే ఇక్కడి నాయకత్వాన్ని పక్కన పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.