పాట్నా: రైలులోని ఏసీ కోచ్‌లో ప్రయాణించిన ఒక మహిళ అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు నిఘా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు, సీఐబీ సంయుక్త బృందం ఆమె లగేజ్‌ను తనిఖీ చేశారు. బ్యాగులు, బ్రీఫ్‌కేస్ నుంచి 75 లీటర్ల వివిధ బ్రాండ్ల మద్యం బాటిల్స్ లభించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతిని అరెస్ట్ చేశారు. (Woman Held With 75 Litres Liquor) మద్యంపై నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. న్యూఢిల్లీ నుంచి జయనగర్ వెళ్తున్న ‘స్వాతంత్ర్య సేనాని ఎక్స్‌ప్రెస్’ రైలులోని ‘హెచ్-1 ఫస్ట్ క్లాస్ ఏసీ’ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళ భారీగా మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది.
కాగా, ఆ రైలు సమస్తిపూర్ స్టేషన్ చేరుకోగానే ఆర్పీఎఫ్, జీఆర్పీ, సీబీఐ బృందాలు ఆ ఏసీ కోచ్‌లోకి చేరుకున్నాయి. ఆ మహిళ వద్ద ఉన్న లగేజ్‌ను బయటకు తెచ్చి తనిఖీ చేశారు. బ్యాగులు, బ్రీఫ్‌కేస్‌లో ఉన్న సుమారు 75 లీటర్ల వివిధ బ్రాండ్ల మద్యం బాటిల్స్‌ను కనుగొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. నేహా కుమారి అలియాస్ నేహా ఝాగా ఆమెను గుర్తించి అరెస్ట్ చేశారు.
మరోవైపు నేహా, ఆమె సోదరీమణులు దర్భంగాలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఒక సోదరిపై ఆ జిల్లాలో మద్యం సంబంధిత కేసు నమోదైనట్లు సమాచారం. అలాగే వ్యవసాయం చేసే నేహా తండ్రి పంకజ్ కుమార్ ఝా కూడా రెండేళ్ల కిందట మద్యం సంబంధిత కేసులో అరెస్టైనట్లు పోలీసులు తెలిపారు. ఆమె తల్లి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
అయితే నేహాపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా మద్యం అక్రమ పంపిణీ వ్యవస్థలో ఆమె భాగమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వైద్యులు, ప్రముఖ వ్యక్తులతో నేహాకు సంబంధాలు ఉండటంతో మద్యాన్ని వారికి ఆమె సరఫరా చేస్తున్నట్లు భావిస్తున్నారు. నేహా నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరికి చేరాల్సి ఉన్నది? ఈ నెట్‌వర్క్‌లో ఇతరుల ప్రమేయం ఉన్నదా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
समस्तीपुर स्टेशन पर गिरफ्तार नेहा की ब्रांडेड शराब बड़े-बड़े डॉक्टरों तक पहुंचनी थी, परिवार में सबसे छोटी; शराब मामले में बहन और पिता भी जा चुके हैं जेल; दिल्ली से जीजा के भाई के साथ मिलकर फर्स्ट AC में शराब लाने वाली की कहानी…#Samastipur #Wine #Liquor #Railway #Neha… pic.twitter.com/CiZkQ4YGix
— Samastipur Town (@samastipurtown) September 6, 2026