Woman jump into Chenab river | తండ్రికి ‘బై బై’ చెప్పి.. వంతెన పైనుంచి నదిలోకి దూకిన యువతి
Woman jump into Chenab river | ఒక యువతి బ్రిడ్జి రైలింగ్ అంచువద్దకు చేరుకున్నది. తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు అక్కడున్న వారితో చెప్పింది. చివరగా ఫోన్లో తండ్రికి ‘బై బై’ చెప్పింది. ఆ తర్వాత వంతెన రైలింగ్ వెనుక నుంచి నదిలోకి దూకింది. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. ఆ యువతి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
శ్రీనగర్: ఒక యువతి బ్రిడ్జి రైలింగ్ అంచువద్దకు చేరుకున్నది. తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు అక్కడున్న వారితో చెప్పింది. చివరగా ఫోన్లో తండ్రికి ‘బై బై’ చెప్పింది. ఆ తర్వాత వంతెన రైలింగ్ వెనుక నుంచి నదిలోకి దూకింది. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. ఆ యువతి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. (Woman jump into Chenab river) జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పాయల్ దేవి అనే యువతి ఆదివారం ఒక జాతరకు వెళ్లింది. తన గ్రామానికి చెందిన తెలిసిన వ్యక్తి బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమైంది.
కాగా, పాయల్ దేవి దుప్పట్టా బైక్ వీల్లో చిక్కుకున్నది. దీంతో ఆ దుపట్టాను తొలగించేందుకు ఆ వ్యక్తి బైక్ ఆపాడు. ఆ సమయంలో ప్రేమ్ నగర్ వంతెన అంచు వద్దకు పాయల్ వెళ్లింది. రైలింగ్ వెనుక వైపు ఆమె నిల్చున్నది. తన జీవితాన్ని ముగించుకోబోతున్నట్లు అక్కడున్న వారికి చెప్పింది. అయితే ఆ ప్రయత్నాన్ని విరమించాలని ఆమెకు నచ్చజెప్పేందుకు వారు ప్రయత్నించారు.
మరోవైపు పాయల్‌తో పాటు ఉన్న వ్యక్తి ఆమె తండ్రికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. దూరం నుంచి ఫోన్లో తండ్రితో మాట్లాడిన ఆమె ఇది తన జీవితమని, ముగించుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పింది. చివరిగా ‘బై బై పాపా’ అని అన్నది. ఆ తర్వాత వంతెన రైలింగ్ వెనుక అంచు నుంచి ప్రవహిస్తున్న చీనాబ్ నదిలోకి ఆమె దూకింది. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. నదిలోకి దూకిన ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఆమె మృతదేహం లభించలేదని పోలీస్ అధికారి తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కొందరు వ్యక్తులు వారి మొబైల్ ఫోన్స్‌లో రికార్డ్ చేసిన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
जम्मू कश्मीर के डोडा में एक महिला बाय-बाय कहकर चिनाब नदी में कूद जाती है
वीडियो दर्दनाक है… pic.twitter.com/0cG9HKTK8T
— Priya Sinha🇮🇳 (@iPriyaSinha) September 5, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

