అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలకు దిగారు. ఈ క్రమంలోనే వారిని మంగళవారం ఉదయం అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇద్దరిపై సెక్షన్ బీఎన్ఎస్ 352, 3(5) SC/ST POA చట్టంలోని సెక్షన్ 3(1)(r), 3(2)(va), 3(2)(vii) కింద కేసులు నమోదు చేశారు.
పోలీసు అధికారులపై దాడి చేసి దూషించారనే ఆరోపణలతో హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపైనా కేసులు నమోదు చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పెట్రోల్ పోసుకుని హంగామా చేశారని ఆప్ కార్యకర్త హేమచంద్రపై, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని బీజేపీ కార్యకర్త గణేశ్‌పై కేసులు పెట్టారు.