న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్‌ను తీసుకొచ్చింది రెనో ఇండియా. గతంలో విడుదల చేసిన ట్రైబర్‌ను అప్‌గ్రేడ్ చేసి మళ్లీ ట్రైబర్ 100 పీఎస్‌ని పరిచయం చేసింది. ఐదు నుంచి ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.7.84 లక్షలుగా నిర్ణయించిన సంస్థ… గరిష్ఠంగా రూ.8.99 లక్షలు.
లీటర్ పెట్రోల్‌కు 21 కిలోమీటర్ల మైలేజి ఇవ్వనున్న ఈ మాడల్‌లో 8 ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, డిజిటల్ ఎల్ఈడీ పరికరం, ఆటో హెడ్‌ల్యాంప్స్, ఆటో ఏసీ, వైర్లెస్ చార్జర్, క్రూజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, స్మార్ట్ యాక్సెస్ కార్డ్, 21 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఫీచర్లున్నాయి.