బినామీల పేర్లపై కోట్ల రూపాయలు
నిమ్స్‌లో అదనపు మెడికల్ సూపరింటెండెంట్, అడిషనల్ ప్రొఫెసర్ నోరి లక్ష్మీ భాస్కర్ బినామీలపై ఏసీబీ దృష్టి పెట్టింది. అతని అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా బినామీల దగ్గర భారీగా నగదు, అక్రమాస్తుల పత్రాలున్నట్టు అనుమానించిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. సోదాల్లో నగదుతోపాటు ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నోరి లక్ష్మీ భాసర్పై ఈ నెల 21న అక్రమాస్తుల కేసు నమోదైంది.
- లక్ష్మీభాస్కర్ కేసులో తవ్విన కొద్దీ బయటపడుతున్న ఆస్తులు
- నిమ్స్ ఉద్యోగుల ఇండ్లల్లో ఐదు చోట్ల ఏసీబీ సోదాలు
- ఓ హౌసింగ్ సొసైటీలో 2.70 కోట్ల విలువైన ప్లాట్ ఉన్నట్టు గుర్తింపు
- నగదు, ఆస్తుల పత్రాలు స్వాధీనం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నిమ్స్‌లో అదనపు మెడికల్ సూపరింటెండెంట్, అడిషనల్ ప్రొఫెసర్ నోరి లక్ష్మీ భాస్కర్ బినామీలపై ఏసీబీ దృష్టి పెట్టింది. అతని అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా బినామీల దగ్గర భారీగా నగదు, అక్రమాస్తుల పత్రాలున్నట్టు అనుమానించిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. సోదాల్లో నగదుతోపాటు ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నోరి లక్ష్మీ భాసర్పై ఈ నెల 21న అక్రమాస్తుల కేసు నమోదైంది. ఆ రోజు జరిగిన సోదాల్లో సుమారు రూ.80 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. తాజాగా బినామీల నుంచి కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నది.
ఉద్యోగి ఇంట్లో 4.94 లక్షల నగదు
నిమ్స్‌లో పనిచేస్తున్న ధనరాజ్ అనే ఉద్యోగి ఇంట్లో రూ.4,94,394 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ప్రాంతంలో వ్యవసాయ భూములకు సంబంధించిన 3 పత్రాలు, బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ పరిధిలో ఉన్న వేంకటేశ్వర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఒక ఓపెన్ ప్లాట్‌కు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. ఈ ప్లాట్ విలువ సుమారు రూ.2.70 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. నిందితుడు లక్ష్మీ భాసర్‌తో ధనరాజ్‌కు ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏంది? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగి పేరుతో లక్షల పెట్టుబడులు
నిమ్స్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న డీ గణేశ్ పేరుతో ఉన్నట్లు భావిస్తున్న రెండు పెట్టుబడులకు సంబంధించిన వివరాలు కూడా గుర్తించినట్టు ఏసీబీ వెల్లడించింది. వాటి విలువ మొత్తం రూ.20 లక్షలుగా పేరొంది. ఈ పెట్టుబడులకు నిధులు ఎలా సమకూరాయి? ఇవి నోరి లక్ష్మీ భాసర్కు సంబంధించినవేనా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నది. నిమ్స్‌లో కాంట్రాక్టులు ఇవ్వడంలో లక్ష్మీ భాస్కర్ చేతివాటం చూపించేవారని తెలిసింది. డబ్బులు తీసుకుని తాతాలిక ఉద్యోగాలు కట్టబెట్టిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

