సినిమాల్లో పాత్రలు మారినట్లే భాష, యాసలు కూడా మారుతుంటాయని, వాటిలో ప్రావీణ్యం సంపాదించడం నటిగా అతి పెద్ద సవాల్ అని చెప్పింది అగ్ర కథానాయిక రాశీఖన్నా. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదితో పాటు హిందీలో పలు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. భాషతో పాటు యాసల్ని నేర్చుకోవడం సాధారణ విషయం కాదని, అదొక జీవితకాల పరీక్షలా అనిపిస్తుందని రాశీఖన్నా చెప్పుకొచ్చింది.
‘కొత్త భాషను, యాసను అర్థం చేసుకోవడం నిరంతర అభ్యాసంలా ఉంటుంది. ఒకటి పూర్తికాగానే మరొకటి నేర్చుకోవాలి. వివిధ భాషా చిత్రాల్లో పనిచేస్తూ..నటిగా ప్రతిభను చాటుకోవాలంటే భాషలపై పట్టు సంపాదించడం చాలా ముఖ్యం. ఈ పరీక్షలకు గ్రాడ్యుయేషన్ డే అంటూ ఉండదు’ అని రాశీఖన్నా పేర్కొన్నది. ప్రస్తుతం ఈ భామ రజనీకాంత్ ‘ధర్మన్’తో పాటు హిందీలో ‘ఫర్జీ’ సిరీస్ రెండో భాగంలో నటిస్తున్నది. అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.