Lokah Chapter 2 | డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన మలయాళ ప్రాజెక్టు ‘లోక చాప్టర్ 1 చంద్ర’ (Lokah Chapter 1 Chandra). కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), నస్లేన్ (Naslen) హీరోహీరోయిన్లుగా నటించారు. 2025 ఆగస్టు 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. లోక 5 పార్టుల సిరీస్‌గా రాబోతుందని ప్రమోషనల్ ఈవెంట్స్‌లో డొమినిక్ అరుణ్ టీం ఇప్పటికే ఓ వార్తను షేర్ చేసిందని తెలిసిందే.
కాగా ఇటీవలే సీక్వెల్ లోక చాప్టర్ 2ను కూడా ప్రకటించేశారు. క్రేజీ సీక్వెల్‌పై ఆసక్తికర వార్తను షేర్ చేసింది కళ్యాణి ప్రియదర్శన్. ‘ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. 2026 సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని భావిస్తున్నా. అవును నేను కూడా సీక్వెల్లో భాగం అవుతున్నా. సినిమా కోసం వెయిట్ చేయండి..’అంటూ చెప్పుకొచ్చింది. కళ్యాణి ప్రియదర్శన్ కామెంట్స్‌తో లోక చాప్టర్ 2పై అభిమానులు, మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. సీక్వెల్‌కు జేక్స్ బిజోయ్ సంగీతం అందించనున్నాడు.
సెకండ్ పార్ట్‌లో టోవినో థామస్ హీరోగా నటించనుండగా.. డొమినక్ అరుణ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. చాఫ్టర్ 1 బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన విషయం తెలిసిందే. మరి రెండో పార్ట్ ఎలాంటి వసూళ్లు రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Mammootty | రుచి, వాసన తెలియలేదు.. తొలిసారి ఆరోగ్య సమస్యపై నోరు విప్పిన మమ్ముట్టి