Chiru Surekha | నువ్వు లేకపోతే నేను లేను.. భార్య సురేఖకు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ బర్త్‌డే విషెస్
Surekha Konidela | మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ పుట్టినరోజు మరియు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నారు.
Surekha Konidela | మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ పుట్టినరోజు మరియు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నారు. తన సినీ ప్రయాణంలోనే కాకుండా, జీవిత ప్రయాణంలోనూ తనకు అండగా నిలిచిన సురేఖపై తనకున్న అపారమైన ప్రేమాభిమానాలను ఆయన ఈ సందర్భంగా చాటుకున్నారు.
1980 ఫిబ్రవరి 20న వివాహం చేసుకున్న ఈ జంట త్వరలోనే 46వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుండగా, సురేఖ తన విజయాల వెనుక ఉన్న అసలు శక్తి అని చిరంజీవి కొనియాడారు. తన ప్రతి అడుగులో వెంట నడిచిన సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె తమ కుటుంబానికి కేంద్రబిందువని, అందరినీ ప్రేమానురాగాలతో ఒక్కటిగా ఉంచే శక్తి ఆమెకే ఉందని చిరంజీవి పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను సొంతవారిగా భావించి, తల్లిదండ్రులకు కన్నకూతురిగా మారిపోయిన తీరును ఆయన గుర్తు చేసుకున్నారు. తన సక్సెస్ గురించి ఎవరైనా అడిగితే అది కేవలం తన టాలెంట్ వల్లనో, కష్టం వల్లనో వచ్చినది కాదని, అది పూర్తిగా సురేఖ వల్లే సాధ్యమైందని చిరంజీవి స్పష్టం చేశారు. ఇంటి బాధ్యతలన్నింటినీ ఆమె భుజాన వేసుకోవడం వల్లే తాను ఎటువంటి ఆందోళన లేకుండా వృత్తిపై దృష్టి పెట్టగలిగానని, ఏ సంక్షోభంలోనైనా తమను కలిపి ఉంచే బలం ఆమె అని ఆయన ఎమోషనల్ అయ్యారు. “నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే” అంటూ తన మనసులోని మాటను హృద్యంగా పంచుకున్న ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మెగా అభిమానులు, సినీ ప్రముఖులు సురేఖ కొణిదెల గారికి పెద్ద ఎత్తున పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు ❤️
Happy Birthday to dearest Surekha.From the day we got married on February 20, 1980, you have been my greatest strength. As we celebrate your birthday today and our wedding anniversary in advance, my heart is… pic.twitter.com/H0J6sE7kTK
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

