మిర్యాలగూడ, ఫిబ్రవరి 18 : మిర్యాలగూడ మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ దంపతులను పట్టణంలోని 26వ వార్డు సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించారు. జనరల్ స్థానంలో ఒక బీసీ ఆడపడుచుకు చైర్మన్ పదవి దక్కడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ చైర్పర్సన్ దంపతులను సన్మానించారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో పగిడిమర్రి సత్యనారాయణ చారి, నరసింహ చారి, భవాని, లక్ష్మీ ప్రసన్న, కృష్ణవేణి పాల్గొన్నారు. గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 31వ వార్డు నుండి చిలుకూరి సుధ బాలకృష్ణ గెలుపొంది చైర్మన్గా, వైస్ చైర్మన్గా 41వ వార్డు కౌన్సిలర్ గుడిపాటి శిరీష ఎన్నికైన విషయం తెలిసిందే.