Padi kaushik Reddy | వృద్ధురాలికి తగిలిన బుల్లెట్.. ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ రేంజ్లో కాల్పులు ఎలా జరుపుతారు..?
Padi Kaushik Reddy | ప్రాక్టీస్ లేని వ్యక్తులు జల్సాల కోసం ఫైరింగ్ చేసిన్రు. ఈ క్రమంలో బోనాల పల్లె గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలి తొడకు బుల్లెట్ తగిలి గాయమైంది. గ్రామంలో అసలు ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ ఆయుధాలు ఎట్లా వాడుతారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
Padi kaushik Reddy | కరీంనగర్ సీపీ భార్య గన్ ఫైర్ చేస్తే ఒక అభాగ్యులైన వృద్ధురాలికి బుల్లెట్ తగిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా సమీపంలో బోనాల పల్లె గ్రామంలో ఫైరింగ్ రేంజ్ ఉంది. ఆ ఫైరింగ్ రేంజ్లో పోలీసులు ప్రాక్టీస్ చేసుకునేందుకు వారి టార్గెట్లను చేదించడానికి ఫైరింగ్ రేంజ్ ఉంటది. ఆ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ చేయాల్సింది పోలీస్ మిత్రులు. కానీ ఆశ్చర్యమేంటంటే ఇక్కడ ఫైరింగ్ చేసింది పోలీస్ మిత్రులు కాదు.. సీపీతోపాటు సీపీ సతీమణి, వారి ఆరుగురు దోస్తులు జల్సాలు చేస్తున్నారన్నారు.
వీరంతా ఏకే 47తో, SLR ఆయుధంతో ఒక్కొక్కరు పది రౌండ్లు ఫైరింగ్ చేస్తరు. అంటే ఒక్క మనిషి 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తడు. ఆరుగురు కలిసి 180 బుల్లెట్లు ఫైరింగ్ చేస్తరు. వాళ్లు ఫైరింగ్ చేస్తే టార్గెట్ ఉంటది.. కొంచెం అటో ఇటో కొడ్తరు. ఇక్కడ ప్రాక్టీస్ లేని వ్యక్తులు జల్సాల కోసం ఫైరింగ్ చేసిన్రు. ఈ క్రమంలో బోనాల పల్లె గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలి తొడకు బుల్లెట్ తగిలి గాయమైంది. గ్రామంలో అసలు ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ ఆయుధాలు ఎట్లా వాడుతారు.. ఆయుధాలతో ఎట్లా ఫైరింగ్ చేస్తరని అడుగుతున్నా. సీపీ సతీమణి ఫైరింగ్ చేసేందుకు ఎవరు అనుమతి ఇచ్చిర్రు. వారి దోస్తులు ఫైరింగ్ చేసేందుకు ఎవరు అనుమతిచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ సీపీ భార్య గన్ ఫైర్ చేస్తే ఒక అభాగ్యురాలైన వృద్ధురాలికి బుల్లెట్ తగిలింది.
కరీంనగర్ సమీపంలో ఉన్న బోనాల పల్లె గ్రామంలో ఫైరింగ్ రేంజ్లో సీపీ భార్య, అతని బంధువులు ఏకే 47, SLR తుపాకీలతో కాల్పులు జరిపారు.
ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలి తొడకు బుల్లెట్ తగిలి… pic.twitter.com/d5cVRDv1ax
— BRS Party (@BRSparty) March 17, 2026
Read Also :
Peddapalli-Palakurthy | పెద్దపల్లిలో కల్వర్ట్ను ఢీకొన్న కారు.. దంపతులు మృతి
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

