Sircilla | మీ కాళ్లు మొక్కుతాం.. జీతాలు ఇవ్వండి.. సిరిసిల్లలో డీడబ్ల్యూవో లక్ష్మీరాజం కాళ్లపైపడి వేడుకున్న దివ్యాంగులు
Sircilla | ‘ఉపాధి కల్పించి అండగా ఉంటమని చెప్పిన్రు. పెట్రోల్ బంక్‌లో పనిచేయించుకున్నరు. జీతాలు మాత్రం సక్కగా ఇస్తలేరు. ఆరేడు నెలలైంది.
Sircilla | సిరిసిల్ల టౌన్, మార్చి 16 : ‘ఉపాధి కల్పించి అండగా ఉంటమని చెప్పిన్రు. పెట్రోల్ బంక్‌లో పనిచేయించుకున్నరు. జీతాలు మాత్రం సక్కగా ఇస్తలేరు. ఆరేడు నెలలైంది. కుటుంబాలను ఎట్ల పోషించుకోవాలే. జీతాలు అడిగితే డీడబ్ల్యూవో కేసులు పెట్టి జైలుకు పంపుతానని బెదిరిస్తున్నడు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పెట్రో ల్ బంక్‌లో పనిచేసే దివ్యాంగులు వాపోయారు. కనికరంలేని ఇటువంటి అధికారిపై చర్యలు తీసుకోండి సార్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వేడుకున్నారు.
‘మీ కాళ్లు మొక్కుతం .. మా జీతాలు ఇయ్యండి సార్’ అంటూ జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. శనివారం సిరిసిల్లలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని రెండో బైపాస్ రోడ్డులో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. అందులో 24 మందిని దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లను నియమించారు.
2024లో అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచి పనిచేస్తున్నా వీరికి సక్రమంగా జీతాలు ఇవ్వడంలేదు. ఒక్కొక్కరికి ఆరేడు నెలల నుంచి ఇవ్వాల్సి ఉన్నది. ఈ క్రమంలో విసిగిపోయిన దివ్వాంగులు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. మున్సిపల్ అధికారులు సమాచారం ఇవ్వడంతో జిల్లా సంక్షేమశాఖ అధికారి (డీడబ్ల్యూవో) అక్కడకు చేరుకున్నారు. ఆడిట్ చేసిన తర్వాత వేతనాలు ఇస్తామని ఆయన చెప్పగా, దివ్యాంగులు తీవ్ర నిరాశ చెందారు. ప్రతిసారి ఇదే చెబుతున్నారని, జీతాలు మాత్రం ఇవ్వడంలేదని మండిపడ్డారు. ‘మీ కాల్మోక్తం.. మా జీతాలు మాకివ్వండి’ అంటూ కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. దీంతో ఆ అధికారి ఐదు రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తానని చెప్పి వెళ్లిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

