పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీర్ల సీనియార్టీ వివాదం పరాకాష్ఠకు చేరింది. అధికారుల మధ్య వర్గపోరు, కుర్చీల కొట్లాటతో శాఖల్లో పరిపాలన పూర్తిగా పట్టాలు తప్పింది. తప్పుడు నివేదికలతో సీనియార్టీ జాబితాను తారుమారు చేసి, అర్హులను పకన పెట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన భాసర్ రెడ్డి ఈఎన్సీ (ఈఆర్ఓ ) పీఠాన్ని దకించుకున్నారని సర్వీస్ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈఎన్సీ నియామకంలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ గ్రాడ్యుయేట్ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీజీపీహెచ్ఎంఈఏ) ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈఎన్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్. భాసర్రెడ్డిని ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. సీనియార్టీ లెకించడంలో భాసర్ రెడ్డి తప్పుడు వివరాలు సమర్పించారని అసోసియేషన్ పేరొంది. ఇప్పటికే క్యూర్ పరిధిలో ట్రై కార్పొరేషన్లకు సంబంధించిన ఇంజినీర్ల బదిలీల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, బదిలీతో పోస్టింగ్ దక్కకుండా జీతాలకు నోచుకోని ఇంజినీర్లు..ఇలా చాలా మంది ఇంజినీర్లు ఈఎన్సీ భాస్కర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో భగ్గుమనడం, తాజాగా ఏకంగా సీఎంవోకు ఫిర్యాదు చేయడం అటు పబ్లిక్, ఇటు మున్సిపల్ విభాగాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీర్-ఇన్-చీఫ్ పోస్టు నియామకంలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ గ్రాడ్యుయేట్ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీజీపీహెచ్ఎంఈఏ) గురువారం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈఎన్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్. భాసర్రెడ్డిని ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. సీనియారిటీ లెకించడంలో భాసర్‌రెడ్డి తప్పుడు వివరాలు సమర్పించారని అసోసియేషన్ పేరొంది. డీఈఈ క్యాడర్ ఆధారంగా సీనియారిటీ చూపించి పదవి పొందారని, కానీ ఎస్ఈ క్యాడర్ జీవో ప్రకారం (జీవో నం 62) ఆయన సీనియారిటీ జాబితాలో 14వ స్థానంలో ఉన్నారని తెలిపింది.
సీనియార్టీ జాబితాలో 2వ స్థానంలో ఉన్న ఎస్. సహదేవ రత్నాకర్, 9వ స్థానంలో ఉన్న బి. విశ్వనాథ రాజు కంటే భాసర్‌రెడ్డి జూనియర్ అని స్పష్టం చేసింది. జనరల్ ట్రాన్స్ ఫర్స్లో జీవో 38 నిబంధనలను ఉల్లంఘించారని, డిపార్ట్ మెంట్ లో ఆరు సీఈ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటీకీ ప్రమోషన్ ప్రక్రియను చేపట్టడం లేదని ఆరోపించింది. అలాగే 30కి పైగా ఎస్ఈ (ఎస్ఈ) ఖాళీలు ఉన్నా భర్తీ చేయకుండా జూనియర్లకు ఎస్ఈ ఎఫ్ఏసీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారని పేరొంది. భాసర్ రెడ్డిని ఎఫ్ఏసీ ఈఎన్సీగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను (జీవో నం 17)ను వెంటనే రద్దు చేయాలని, సీనియర్లు అయిన సహదేవ రత్నాకర్, బి. విశ్వనాథ రాజులలో ఒకరికి ఇంజినీర్-ఇన్-చీఫ్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వంని డిమాండ్ చేసింది.
ఇంజినీర్లలో ముదిరిన సీనియార్టీ గొడవ!
తప్పుడు నివేదికలతో ఈఎన్సీ పీఠాన్ని దకించుకున్న పక్క రాష్ట్ర అధికారి భాసర్ రెడ్డి వైఖరిపై తెలంగాణ ఇంజినీర్ల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తప్పుడు సీనియార్టీ రికార్డులను సృష్టించి కీలకమైన ఈఎన్సీ పీఠాన్ని హస్తగతం చేసుకున్నారంటూ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. తెలంగాణ ప్రాంత అధికారుల హకులను కాలరాస్తూ, అర్హత లేని ఆంధ్ర అధికారికి అగ్రపీఠం కట్టబెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఇంజనీర్ల అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటుగా లేఖ రాసింది. గడిచిన రెండు నెలలుగా శాఖలో సాగుతున్న కుర్చీల కొట్లాట, వర్గపోరు కారణంగా మున్సిపల్ శాఖ ప్రాజెక్టుల పర్యవేక్షణతో పాటు కీలక అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడ్డాయని చెబుతున్నారు. బంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నియామకాన్ని వెంటనే రద్దు చేసి, తెలంగాణ సీనియర్ అధికారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఇంజనీర్ల సంఘం స్పష్టం చేస్తోంది.
స్తంభించిన అభివృద్ధి.. పెండింగ్‌లో ఫైళ్లు
గడిచిన రెండు నెలలుగా ఈఎన్సీ పీఠం చుట్టూ తిరుగుతున్న ఇంజనీర్ల ‘కుర్చీల కొట్లాట’ కారణంగా సచివాలయం నుంచి ట్రై కార్పొరేషన్లో క్షేత్రస్థాయి వరకు అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయి. అధికారుల పంచాయితీ వల్ల ప్రాజెక్టుల పురోగతి, రోడ్ల మరమ్మతులు, బిల్లుల ఆమోదాలు నిలిచిపోయాయి… బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు తమ సీనియారిటీ కాపాడుకోవడానికే సమయాన్ని కేటాయిస్తుండటంతో ప్రజాధనం, సమయం వృథా అవుతోందని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని ఇంజినీరింగ్ శాఖల్లో పేరుకుపోయిన ఈ సీనియార్టీ రగడకు ముగింపు పలకాలని, తప్పుడు నివేదికల వెనుక ఉన్న నిందితులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇం.ఇనీర్ల సంఘం డిమాండ్ చేస్తోంది.