హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన బాలానగర్.. ఇప్పుడు ఉత్తర, మధ్య హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతంగా రూపాంతరం చెందుతున్నది. మెరుగైన సామాజిక మౌలిక సదుపాయాలు, అద్భుతమైన రవాణా అనుసంధానం, ఐటీ కారిడార్‌కు సమీపం, ప్రపంచస్థాయి విద్య, వైద్య సంస్థలు, షాపింగ్ వంటి అనేక ప్రత్యేకతలతో బాలానగర్ గృ హ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు ప్రధాన గమ్యస్థానంగా అవతరిస్తున్నది. కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తున్న నేపథ్యంలో బాలానగర్‌లో నిరుపయోగంగా మారిన పారిశ్రామిక భూ ములు ప్రస్తుతం ఆధునిక నివాస ప్రాజెక్టులకు కేంద్రంగా మారుతున్నాయి.
ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ
బాలానగర్-కూకట్ పల్లి ప్రాంతంలో ఏ2ఏ సెంట్రల్ మాల్ సమీపంలో నిర్మిస్తున్న ఏ2ఏ హోమ్ ల్యాండ్ ప్రీమియం 3బీహెచ్‌కే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన గ్లోబల్ హోమ్స్ అండ్ హైట్స్ ఎల్ఎల్పీ అభివృద్ధి చేస్తున్నది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో 40కి పైగా నివాస, వాణిజ్య ప్రాజెక్టులను పూర్తిచేసిన సంస్థగా రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుర్తింపు పొందింది. నాణ్యత, విశ్వసనీయత, సకాలంలో ప్రాజెక్టుల పూర్తి, వినియోగదారుల విశ్వాసం చూరగొన్నది. తొలిదశలో 12 ఎకరాల్లో 7 బ్లాక్‌లు, రెండో దశలో 6 ఎకరాల్లో 5 బ్లాక్‌ల నిర్మాణం జరుగుతున్నది. విశాలమైన అపార్ట్మెంట్లు, రెండు భారీ క్లబ్‌హౌస్‌లు, విస్తారమైన పచ్చదనం, కాలుష్యరహిత వాతావరణం, వాహన రహిత పోడియం, ఏడు చక్రాల థీమ్‌తో ల్యాండ్ సేపింగ్ వంటి ప్రత్యేకతలను ప్రాజెక్టులో అందిస్తున్నారు.
ఈప్రాంతం నగరం నడిబొడ్డున ఉండటం, కూకట్పల్లి వై జంక్షన్, సికింద్రాబాద్, మెట్రోస్టేషన్లకు సమీపం, హైటెక్ సిటీకి వేగవంతమైన అనుసంధానం, విద్యాసంస్థలు, దవాఖానలు, మాల్స్, వినోద కేంద్రాలు దగ్గరలో ఉండటం వంటి అంశాలను ప్రాజెక్టు ప్రధాన బలాలుగా ఉన్నాయి. అన్ని యూనిట్లు 3 బీహెచ్కేలే కావడం, విశాలమైన బాలనీలు, రెండు ఆధునిక క్లబ్‌హౌస్‌లు, పచ్చని వాతావరణం కుటుంబాలకు అనువైన జీవనశైలిని అందిస్తాయి ఫేజ్- 1 అప్పగింత త్వరలో ప్రారంభం కానుండగా, ఫేజ్-2 కూడా త్వరలో ప్రారంభం కానున్నది. అయితే, తాజాగా ఫేజ్-1లోని బీ, సీ, ఐ, జే బ్లాకులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లభించినందున వీటికి జీఎస్టీ నుంచి వినియోగదారులకు/కొనుగోలుదారులకు ఉపశమనం లభించనున్నది. తద్వారా మరింత చౌకగా ప్లాట్లు పొందే వెసులుబాటు కలుగుతుంది.
మెట్రో, హైటెక్ సిటీ, విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీ
బాలానగర్ మెట్రో స్టేషన్ ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉన్నది. హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) జీనోమ్ వ్యాలీ వంటి కీలక ప్రాంతాలకు ఈ ప్రాంతం సమీపంలోనే ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారి-44 ద్వారా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా సులభంగా చేరుకొనే సౌలభ్యం ఉండటంతో ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఇది అనుకూలమైన నివాస ప్రాంతంగా మారింది. ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలు, విద్యాసంస్థలు ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. అలాగే ప్రముఖ హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ2ఏ సెంట్రల్ మాల్, పీవీఆర్ నెక్స్ట్ గలేరియా, మిరాజ్ సినిమాస్ తదితర షాపింగ్, వినోద కేంద్రాలు జీవనశైలిని మరింత సౌకర్యవంతంగా మారుస్తున్నాయి.