వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టే ‘ఐ హేట్ మ్యారేజ్’
‘బయట ఓ అబ్బాయిని ప్రేమిస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు చూపించిన మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. ఇది నేటి కొందరు అమ్మాయిల తీరు. అసలు ఎందుకిలా జరుగుతోంది? ప్రేమపై క్లారిటీ లేకా? పెళ్లిపై నమ్మకం లేకా? ఈ రెండూ కాక, తల్లిదండ్రులపై ఉన్న గౌరవమా? ఈ ప్రశ్నలకు సమాధానమే నా ‘ఐ హేట్ మ్యారేజ్' చిత్రం’ అంటున్నారు దర్శకుడు పరమేశ్ రేణుకుంట్ల.
‘బయట ఓ అబ్బాయిని ప్రేమిస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు చూపించిన మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. ఇది నేటి కొందరు అమ్మాయిల తీరు. అసలు ఎందుకిలా జరుగుతోంది? ప్రేమపై క్లారిటీ లేకా? పెళ్లిపై నమ్మకం లేకా? ఈ రెండూ కాక, తల్లిదండ్రులపై ఉన్న గౌరవమా? ఈ ప్రశ్నలకు సమాధానమే నా ‘ఐ హేట్ మ్యారేజ్’ చిత్రం’ అంటున్నారు దర్శకుడు పరమేశ్ రేణుకుంట్ల. సమాజంలోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆయన తెరకెక్కించిన ఈ చిత్రంలో సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా నటించారు.
మాదం దయానంద్, కార్తీక్ వెంపటి నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో దర్శకుడు పరమేశ్ రేణుకుంట్ల విలేకరులతో మాట్లాడారు. ‘ఎలాంటి ఎమోషన్సూ లేని అబ్బాయి, ఓ ఆకతాయి అమ్మాయి మధ్య జరిగే కథ ఇది. సమాజంలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు పరమేశ్ రేణుకుంట్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

