ఫేస్ రికగ్నిషన్ ఫెయిలైతే నేరుగా కార్యాలయానికే!
లెర్నింగ్ లైసెన్స్ ప్రక్రియలో ఆన్లైన్ విధానం దరఖాస్తుదారులకు తలనొప్పిగా మారింది. ఇటీవల ఆర్టీఏ లెర్నింగ్ లైసెన్స్‌ను ఆన్లైన్లో ఇంటి నుంచే పొందే వెసులుబాటు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : లెర్నింగ్ లైసెన్స్ ప్రక్రియలో ఆన్లైన్ విధానం దరఖాస్తుదారులకు తలనొప్పిగా మారింది. ఇటీవల ఆర్టీఏ లెర్నింగ్ లైసెన్స్‌ను ఆన్లైన్లో ఇంటి నుంచే పొందే వెసులుబాటు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్లాట్ బుక్ చేసుకునే సమయంలో దరఖాస్తుదారులు తమకు నచ్చిన విధానాన్ని ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ఎంచుకోవచ్చు. అయితే ఫేస్ రికగ్నిషన్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంటి నుంచి పరీక్ష రాసే సమయంలో అప్రమత్తంగా లేకపోతే పలు టెక్నికల్ ఎర్రర్స్ వస్తున్నాయి. పరీక్ష రాసే సమయంలో అభ్యర్థి ముఖాన్ని వెబ్‌క్యామ్ నిరంతరం స్కాన్ చేస్తూనే ఉంటుంది.
అయితే చాలా మందికి ఫేస్ రికగ్నిషన్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఫేస్ రికగ్నిషన్ ఫెయిల్ అయితే ఎల్ఎల్ఆర్ రద్దు అవుతుంది. అయితే అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా బ్యాకప్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. వారు నేరుగా సంబంధిత ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లి పరీక్ష రాయొచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

